iDreamPost

సలార్ రైట్స్.. తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ రికార్డు..?

  • Author ajaykrishna Published - 04:31 PM, Fri - 27 October 23

సలార్ మూవీకి ఉన్న హైప్.. ఈ ఏడాది ఏ సినిమాకు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటిదాకా సినిమా నుండి కేవలం పోస్టర్స్, ఒక టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సలార్ కూడా కేజీఎఫ్ లో భాగంగా వస్తోందని టాక్ మొదలైంది. సలార్ పై హైప్ కి అదొక కారణం. తాజాగా సలార్ థియేట్రికల్ రైట్స్ కి తెలుగులో ఉన్న డిమాండ్ గురించి..

సలార్ మూవీకి ఉన్న హైప్.. ఈ ఏడాది ఏ సినిమాకు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటిదాకా సినిమా నుండి కేవలం పోస్టర్స్, ఒక టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సలార్ కూడా కేజీఎఫ్ లో భాగంగా వస్తోందని టాక్ మొదలైంది. సలార్ పై హైప్ కి అదొక కారణం. తాజాగా సలార్ థియేట్రికల్ రైట్స్ కి తెలుగులో ఉన్న డిమాండ్ గురించి..

  • Author ajaykrishna Published - 04:31 PM, Fri - 27 October 23
సలార్ రైట్స్.. తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ రికార్డు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు.. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించగా.. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తారాస్థాయిలో అంచనాలు సెట్ చేసిన సలార్ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కాగా.. సలార్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇక సలార్ మూవీకి ఉన్న హైప్.. ఈ ఏడాది ఏ సినిమాకు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటిదాకా సినిమా నుండి కేవలం పోస్టర్స్, ఒక టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులోనూ సలార్ గురించి.. అందులో క్యారెక్టర్స్ గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు.. ఏ మ్యాటర్ రివీల్ చేయలేదు. అయినా సరే ఫ్యాన్స్ లో ఇంతటి హైప్ కి కారణం ఏంటంటే.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్. అవును.. బాహుబలి, సాహోలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు అందుకున్న ప్రభాస్.. కేజీఎఫ్ తో రికార్డులు కొల్లగొట్టిన ప్రశాంత్ నీల్ తో జతకట్టేసరికి ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. వెరసి.. సినిమాపై బజ్ ఊహించని రేంజ్ లో నమోదైంది.

ఇదిలా ఉండగా.. సలార్ కూడా కేజీఎఫ్ లో భాగంగా వస్తోందని టాక్ మొదలైంది. సలార్ పై హైప్ కి అదొక కారణం. ఇవన్నీ పక్కన పెడితే.. సలార్ డిజిటల్ రైట్స్ ఆ మధ్య రూ. 350 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. తాజాగా సలార్ థియేట్రికల్ రైట్స్ కి తెలుగులో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సలార్ రైట్స్ నైజాం వరకు మైత్రి మూవీస్ వారు రూ. 65 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు రెండు తెలుగు స్టేట్స్ కలిపి ఏకంగా రూ. 170 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ఇందులో రూ. 65 కోట్ల వరకు నైజాం.. రూ. 27 కోట్లు సీడెడ్.. రూ. 75 కోట్ల వరకు ఆంధ్రాలో పలికినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి సలార్ కి ఉన్న హైప్ కి ఆ రేంజ్ లో వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందని అర్ధమవుతుంది. మరి సలార్ బిజినెస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి