iDreamPost

Salaar Movie: ఇండియన్ స్టాండర్డ్స్‌ని మించి…. సలార్

బాహుబలి2 మూవీ తర్వాత వరుస అపజయాాలు చవిచూసిన పాన్ ఇండయా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరేళ్ళుగా సరైన్ హిట్ కోసం ప్రభాస్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి2 మూవీ తర్వాత వరుస అపజయాాలు చవిచూసిన పాన్ ఇండయా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరేళ్ళుగా సరైన్ హిట్ కోసం ప్రభాస్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Salaar Movie: ఇండియన్ స్టాండర్డ్స్‌ని మించి…. సలార్

ఇదిగో ఇలాంటి సినిమా గురించే ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ మద్య వచ్చిన కొన్ని సినిమాలతో పూర్తిగా నిరాశపడి, నీరసపడిసోయిన ప్రభాస్ అబిమానగణం కాలర్ ఎత్తుకుని తిరిగేట్టు ఉంది సలార్. ఆమేరకు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా తన బాధ్యతని చాలా సమర్ధవంతంగా పోషించినట్టే. విజయవంతమైనట్టే. ప్రభాస్ నుంచి ఏమైతే అందరూ ఆశిస్తారో అవన్నీ పుష్కలంగా ఉండటమే కాదు, కథని బాగా ఎలివేట్ చేసి, సీన్లన్నీ అద్భుతంగా పండే విధంగా స్క్రీన్ నెరేషన్ ని పెరఫెక్టుగా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ కి ముందుగా ఐ డ్రీమ్ కంగ్రాట్యులేషన్స్ చెబుతోంది.
సాధారణంగా ఇండియన్ సినిమాలు, అది ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అయినా కావచ్చు గానీ, హాలీవుడ్ సినిమాలను తలదన్నడం మాట అటుంచి, కనీసం ఆ స్టాండర్డ్ లో కూడా ఉండవు. ఆ కొరతని సలార్ ద్వారా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తీర్చేసింది.

సినిమా ప్రారంభమైన  దగ్గర నుంచి చివరి వరకూ ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది. హీరో ఎలివేషస్స్ గానీ, హీరో చేసే పనులు గానీ ఏవీ కూడా ఆర్టిఫిషియల్ గా కాకుండా కథానుసారంగా నడిచి, సందర్భోచితమైన రీతిలో ముందుకు సాగడమే సలార్ లో ప్రత్యేకత. ఫస్ట్ హాఫ్ చూస్తే మొత్తం నిడివిలో ప్రభాస్ పాత్ర ఎక్కడా కథలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఎంత పరిమితంగా ఉండాలో అంతలో ఉండి, ప్రభాస్ నెక్స్ట్ ఏం చేస్తాడనే ఉత్కంఠకు అవకాశముంచి సినిమాని ముందుకు తీసికెళ్ళాడు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ కన్నా కూడా బాగా తీశాడనే ప్రశంసలను మూటకట్టుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ని ఆయుధంగా వాడుకున్నాడు. సెకండాఫ్ కావాల్సిన బలాన్ని కాపాడుకుని, కథలోని ప్రధాన భాగాన్ని చాలా ఎఫెక్టివ్ గా, గుండెల్ని పిండే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను పొందుపరిచి సినిమాని బాగా ఎలివేట్ చేయడంలో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు దర్శకుడు ప్రశాంత్.

ప్రభాస్ వరకూ వస్తే, ఇది కదా ప్రభాస్ నుంచి ఆడియన్స్ గానీ, ప్రభాస్ అభిమానులు గానీ కోరుకునేది అన్నట్టుగా ఉంది ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ప్రభాస్ మువ్ మెంట్స్ కావచ్చు. మొదటి హాప్ లో సైలెంట్ గా కనిపించే ప్రభాస్, సెకండాఫ్ లో స్నేహితుడి స్థానాన్ని కాపాడే ప్రయత్నంలో తలపెట్టే వయొలెన్స్ ప్రభాస్ అభినందనీయంగా చేసి ఆడిటోరియం ఇంట్రస్ట్ ని సుపర్బ్ గా నిలబెట్టాడు. కలర్ గ్రేడింగ్, ఏంబియన్స్, సెట్ వర్క్, ఖాన్సార్ ప్రపంచంలో ఉండే వాస్తవికతలో ప్రభాస్ కొత్తగా కనిపించాడు. హీరోయిజం కోసం కలర్ ఫుల్ డ్రసెస్, కాశ్మీర్లో సాంగ్స్, శ్రుతిహాసన్ గురించి గ్లామర్ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, కథని మాత్రమే ప్రజెంట్ చేయడం వల్ల ప్రభాస్ క్యారెక్టర్, తద్వారా ప్రభాస్ నేచరురల్ ఎలివేషన్స్ తో మనసుకు హత్తుకునేలా ఎక్స్సైట్ మెంట్ ని అడుగడుగునా నింపాయి. దానాదీనా, సలార్ గ్యారెంటీగా ఇండియన్ స్టాండర్డ్స్ ని మించి, అధిగమించి సలార్ గ్రేట్ ధియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని అందించిన సినిమా రికార్డు నెలకొల్సుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి