iDreamPost

‘KGF 2’కి సలార్ స్టోరీ లింక్ నిజమే! ఇదిగో అసలు ప్రూఫ్..!

  • Author ajaykrishna Published - 01:31 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 01:31 PM, Wed - 5 July 23
‘KGF 2’కి సలార్ స్టోరీ లింక్ నిజమే! ఇదిగో అసలు ప్రూఫ్..!

వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. సలార్ తో ప్రభాస్ ని తన యూనివర్స్ లో చేర్చుకోనున్నాడు. ఇప్పటిదాకా సలార్ కి, కేజీఎఫ్ కి లింక్ ఉందా లేదా అనే విషయంపై డైరెక్టర్, మూవీ టీమ్ నోరుతెరిచి క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ప్రభాస్ ని మాస్ అవతారంలో చూసేసరికి ఫ్యాన్స్ లో కేజీఎఫ్ కి లింక్ ఉందనే సందేహాలు మొదలైపోయాయి. ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ సలార్.. రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇక మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుండగా.. జులై 6న ఉదయం 5:12 గంటలకు సలార్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ టీజర్ పై పీక్స్ లో అంచనాలు ఉండగా.. కేజీఎఫ్ 2కి, సలార్ కి లింక్ ఉందని అధికారికంగా ఓ ప్రూఫ్ బయటికి వచ్చింది. తాజాగా సలార్ టీమ్ ఐఎండిబి లో మూవీ స్టోరీ లైన్ ని అప్డేట్ చేశారు. అది చూసేసరికి సలార్ ఫ్యాన్స్ కి.. కేజీఎఫ్ తో లింక్ నిజమేనని కన్ఫర్మ్ అయిపోయింది. సలార్ స్టోరీ లైన్ గమనిస్తే.. చనిపోయిన తన గ్యాంగ్ స్టర్ ఫ్రెండ్ ప్రామిస్ ని కంటిన్యూ చేస్తూ మిగతా గ్యాంగ్స్ ని మట్టుపెట్టడమే సలార్ స్టోరీ. అంటే.. సముద్రంలో పడి చనిపోయిన రాఖీభాయ్ లెగసిని.. సలార్ కంటిన్యూ చేస్తాడని తెలుస్తోంది.

Salaar link to KGF

మరి రాఖీభాయ్ కి, సలార్ కి పరిచయం ఎక్కడ? స్నేహం ఎక్కడ కుదిరింది? వీరి లైఫ్ స్టోరీస్, బ్యాక్ డ్రాప్ ఏంటనేది సలార్ లో చూపిస్తారని టాక్. మరి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సలార్ ఫ్యాన్స్ కి.. ఇప్పుడీ స్టోరీ లైన్ ఫుల్ మీల్స్ లా దొరికిందని చెప్పాలి. మరి టీజర్ వస్తే.. సలార్ మూవీపై పూర్తి క్లారిటీ రాబోతుంది. ఇక సలార్ మూవీని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సలార్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయారు. సలార్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి