iDreamPost

14 నంది అవార్డ్స్ తీసుకున్న ఈ నటుడి బ్యాగ్రౌండ్ ? ఆ స్టార్స్ అందరికీ లైఫ్ ఇచ్చాడు!

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ ఎఫ్2, ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇందులో అంతేగా అంతేగా అలరించిన నటుడు గుర్తున్నాడు కదా. చాలా మందికి కేవలం నటుడిగా

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ ఎఫ్2, ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇందులో అంతేగా అంతేగా అలరించిన నటుడు గుర్తున్నాడు కదా. చాలా మందికి కేవలం నటుడిగా

14 నంది అవార్డ్స్ తీసుకున్న ఈ  నటుడి బ్యాగ్రౌండ్ ? ఆ స్టార్స్ అందరికీ లైఫ్ ఇచ్చాడు!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్, ఫ్రాంజెస్ మూవీ ఎఫ్2, ఎఫ్ 3. ఇందులో తమన్నా భాటియా, మోహరీన్ హీరోయిన్లుగా నటించారు.  ప్రగతి, అన్నపూర్ణ, వై విజయ, ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రధారులు. తమ నవ్వులతో పువ్వులు పూయించారు. ఇందులో అమాయకమైన భర్త పాత్రలో నటించాడు సీనియర్ నటుడు ప్రదీప్. ‘అంతేగా అంతేగా’ అంటూ ఎఫ్ 2, ఎఫ్3లో కితకితలు పెట్టించాడు. ఈ కాలం తరానికి ప్రదీప్ అనగానే ఈ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఓ సీనియర్ నటుడు అని మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు అమ్మాయిలు కలల రాకుమారుడు. ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకున్నారు. అప్పట్లో ఆయనకు రోజుకు 500 ప్రేమ లేఖలు వచ్చాయంటే..  అతడి క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతుంది.

ప్రదీప్ సక్సెస్ ఫుల్ హీరో మాత్రమే కాదు.. కంప్లీట్ మ్యాన్. అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించిన నటుడు. హాస్య బ్రహ్మ జంధ్యాల పరిచయం చేసిన నటుల్లో ఒకరు ప్రదీప్. ముద్ద మందారం మూవీతో డ్రీమ్ బాయ్‌గా మారిన ప్రదీప్, మల్లె పందిరి, నాలుగు స్థంబాలాట, రెండు జెళ్ల సీత వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. ఇవే కాకుండా అనేక సీరియల్స్ చేశాడు. హీరోగా వెండితెరను ఏలుతున్న సమయంలోనే చదువుకు ప్రాధాన్యతనిచ్చాడు. కష్టపడి చదివి సీఏ పూర్తి చేశాడు. అక్కడితో ఆగిపోలేదు.. బుల్లితెరపై సీరియల్స్ నిర్మించాడు. తెలుగులో ఫస్ట్ సీరియల్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆయనే కావడం విశేషం. అంతేకాదు..టెలివిజన్ రంగంలో 14 నంది అవార్డులు కూడా వచ్చాయి. సీరియల్స్ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో పదిహేను వేల కుటుంబాల ఉపాధి కల్పించిన వ్యక్తిగా మారాడు.

ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వారిలో ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, శ్రీనివాస రెడ్డి, ఉత్తేజ్, ధర్మవరపు సుబ్రమణ్యం ఇలాంటి ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రదీప్. హీరోగా ఉంటే..అక్కడే ఆగిపోవాల్సి వస్తుందని భావించిన ఆయన.. ఓ సంస్థను స్టార్ట్ చేసి..కార్పొరేట్ ఫిల్మ్స్, ఎడ్వర్టైజ్ మెంట్, ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. 1985లో పర్సనాలిటీ డెవలప్ మెంట్, వ్యక్తిత్వ వికాసం అంటే ఎంటే తెలియని రోజుల్లోనే ఆయన భార్యతో కలిసి 7 పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాడు. టైం లేదని చెప్పకుండా ఇప్పటికీ భార్యతో, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నాడు. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయొచ్చు అని నిరూపించిన నటుడు ఆయన. గుండెల్లో ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పేందుకు ఆయనే ఒక ఉదాహరణ. కానీ ఈ తరానికి ఇవేమీ తెలియదు. కాన హాస్య నటుడిగా మాత్రమే గుర్తిండిపోయాడు. మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనే పదానికి నిలువటద్దం ఆయన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి