iDreamPost

యూనివర్సిటి ఈసీల్లో ఆ వర్గాలకే పెద్దపీట

యూనివర్సిటి ఈసీల్లో ఆ వర్గాలకే పెద్దపీట

యూనివర్సిటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ళ నియామకాని టీడీపీ వివాదస్పదం చేస్తుంది . రాష్ట్రంలోని 14 యూనివర్సిటిల్లో ఈసీ సభ్యులను నియమిస్తు ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులపై తెలుగుదేశంపార్టీతో పాటు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియా విపరీతమైన ఆరోపణలు చేసింది. కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఈసి నియామకాలతో యూనివర్సిటిలను ప్రభుత్వం కంపు చేసేసిందంటూ పెద్ద ఎత్తున రద్దాంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

చంద్రబాబు మద్దతు మీడియా చేసిన ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. దాని ప్రకారం ఈసీ నియామకాల్లలో కూడా తమ ప్రభుత్వం ఐదు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పాడు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి వర్గాలకు 50 శాతం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదన్న విషయాన్ని సజ్జల గుర్తు చేశాడు. తన వాదనకు తగ్గట్లుగా వివరాలతో కూడిన ఓ టేబుల్ ను కూడా విడుదల చేశాడు.

14 యూనివర్సిటిలకు నియమించిన పాలకమండళ్ళల్లో 180 మందిని ఎటువంటి సిఫారసులు లేకుండానే నియమించారట. 390 అభ్యర్ధనల్లో 202 దరఖాస్తులను ఉన్నత విద్యామండలే నేరుగా పరిగణలోకి తీసుకున్నట్లు సజ్జల వివరించారు. నియామకాల ఫైల్ జగన్మోహన్ రెడ్డి వస్తే దాన్ని తిప్పి పంపినట్లు రాసిన కథనాల్లో నిజం లేదని కూడా సలహాదారు స్పష్టం చేశారు.

అదే సమయంలో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన నియామకాల్లో ఏమి జరిగిందో కూడా సజ్జల వివరించారు. అప్పట్లో ఒకే సామాజికవర్గానికి చంద్రబాబు పెద్దపీట వేసిన విసినట్లు మండిపడ్డారు. నియామకాల విషయంలో ఒకరోజు ఇచ్చిన జీవోను మరుసటి రోజు సవరిస్తు మరో జీవో జారీ చేసింది నిజం కాదా అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా నియమ, నిబంధనలను అనుసరించలేదట. తనకు సన్నిహితుడైన శ్రీనివాసులనాయుడు తయారు చేసిన జాబితానే చివరకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా తెలీకుండా చంద్రబాబు ఆమోదముద్ర వేసింది నిజం కాదా అంటూ సజ్జల సూటిగా వేసిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి