iDreamPost
android-app
ios-app

నిహారిక పర్సనల్ లైఫ్ పై నెటిజన్ కామెంట్! స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తేజ్..

  • Author Soma Sekhar Published - 05:19 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 05:19 PM, Thu - 17 August 23
నిహారిక పర్సనల్ లైఫ్ పై నెటిజన్ కామెంట్! స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తేజ్..

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వరసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఒకటి సూపర్ హిట్ మూవీ విరూపాక్ష కాగా.. రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘బ్రో’. అయితే ఈ రెండు మూవీల్లో విరూపాక్ష సూపర్ హిట్ అయితే.. బ్రో మాత్రం నిరాశపరిచింది. కానీ సాయిధరమ్ తేజ్ కు మాత్రం మామ పవన్ కళ్యాణ్ తో నటించిన తృప్తి మాత్రం మిగిలింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. నోరు మూసుకుని ఆ కామెంట్ ను డిలీట్ చేయ్ అంటూ ఘాటుగా స్పందించాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?

మెగాడాటర్ నిహారిక-చైతన్య జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక డైవర్స్ తర్వాత పలు వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం సాయిధరమ్ తేజ్ ఓ అప్డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ కృష్ణ కోసం ఓ ప్రైవేట్ వీడియో సాంగ్ లో నటించాడు. స్వాతిరెడ్డితో కలిసి ‘సత్య’ అనే వీడియో సాంగ్ లో నటించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చినప్పుడు.. మెగాడాటర్ రిప్లై ఇస్తూ.. ఈ సాంగ్ చూడడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్ చేసింది.

Sai dharam tej serious on netizen who comment on niharika

కాగా.. ఈ కామెంట్ కు ఓ ఆకతాయి ఆమె పర్సనల్ లైఫ్ ను టచ్ చేస్తూ.. నిహారిక గురించి కామెంట్ చేశాడు. “వీటిపైన పెట్టిన ద్యాస.. ఫ్యామిలీపై పెట్టుంటే బాగుండేది” అంటూ ఆ ఆకతాయి కామెంట్ చేశాడు. దీంతో ఆ కామెంట్ చూసి సాయిధరమ్ తేజ్ కు విపరీతమైన కోపం వచ్చింది. “నోరు మూసుకో.. వెంటనే కామెంట్ డిలీట్ చెయ్” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇక తేజ్ ఫ్యాన్స్ కూడా ఆ నెటిజన్ పై విరుచుకుపడ్డారు. సంస్కార హీనులే ఇలా వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడుతారు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కాగా.. ఆ కామెంట్ ను సదరు నెటిజన్ కూడా డిలీట్ చేశాడు. ఆ తర్వాత తేజ్ సైతం తన వార్నింగ్ ను డిలీట్ చేశాడు. అయితే మరదలికి అండగా నిలిచిన తేజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. మరి తేజ్ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ సెన్సేషన్! గుర్తుపట్టారా?

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis