iDreamPost
android-app
ios-app

ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ సెన్సేషన్! గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 17 August 23
ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ సెన్సేషన్! గుర్తుపట్టారా?

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు ఓ బ్రాండ్ కాదు. అంతకంటే ఎక్కువే. ప్రస్తుతం రజినీ పేరు వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోతోంది. రజినీ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్నో రోజులుగా తలైవా నుంచి మంచి హిట్ కావాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బంపర్ బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు సూపర్ స్టార్. మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్నా గానీ వసూళ్లలో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళ్తున్నాడు తలైవా. ఇప్పటికే రూ. 400 కోట్ల క్లబ్ లో చేరాడు రజినీ. దీంతో రజినీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ స్టార్ ఓ బుడ్డోడిని ఎత్తుకున్న పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బుడ్డోడు ఇప్పుడ ఓ సెన్సేషన్ మీరు గుర్తుపట్టారా?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సెలబ్రిటీలకు చెందిన చిన్ననాటి ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలా ప్రస్తుతం ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బుడ్డోడిని ఎత్తుకుని ఉన్న పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పిల్లాడు ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఓ సెన్సేషన్. అతడు ఓ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికైనా గుర్తుపట్టారా? చిన్న వయసులోనే సంగీతాన్ని అవపోసన పట్టిన కుర్రాడు, అదీకాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి సైతం అతడు వర్క్ చేశాడు. ఈ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు.. అనిరుధ్ రవిచంద్రన్. అవును సూపర్ స్టార్ రజినీ ఎత్తుకున్న ఈ బుడ్డోడు అనిరుధ్.

ఇక రజినీకి అనిరుధ్ కు ఉన్న సంబంధం చాలా మందికి తెలియకపోవచ్చు. వారిద్దరు వరసకు మామ-అల్లుడు అవుతారు. రజినీకాంత్ సతీమణి లతా రజినీకి అనిరుధ్ మేనల్లుడు అవుతాడు. ఇక అనిరుధ్ కు రజినీ మామ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం తలైవా షూటింగ్ లో ఉండగా.. రజినీ-అనిరుధ్ ని ఎత్తుకుని ఫొటో దిగాడు. ఇప్పుడు అదే పిక్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో రజినీ-అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఆ వేడుకలో విఘ్నేష్ మాట్లాడుతూ..”జైలర్ మూవీలో తండ్రీ కొడుకుల అనుబంధం గురించి నేను ఓ పాట రాశాను. ఈ పాటను రాసే క్రమంలో అనిరుధ్ కు రజినీపై ఉన్న నిజాయితీ, ప్రేమ కనిపించాయి. తలైవాకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. కానీ అనిరుధ్ తో కొడుకు లేని లోటు తీరిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు విఘ్నేష్. మరి ఈ పిక్ చూడగానే రజినీ ఎత్తుకున్న బుడ్డోడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అని ఎంత మంది గుర్తుపట్టారో? కామెంట్ చేయండి.

ఇదికూడా చదవండి: ఫ్యాన్స్ కి బిగ్ షాక్! పాటలు లేకుండానే సలార్ ప్రమోషన్స్?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetslotbaba girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom