iDreamPost
android-app
ios-app

Sai Dharam Tej: ఆ విషయంలో బాధపడుతున్న సాయిధరమ్ తేజ్! ఎమోషనల్ పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Updated - 02:36 PM, Tue - 13 June 23
  • Author Soma Sekhar Updated - 02:36 PM, Tue - 13 June 23
Sai Dharam Tej: ఆ విషయంలో బాధపడుతున్న సాయిధరమ్ తేజ్! ఎమోషనల్ పోస్ట్ వైరల్..

సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుల వరకు తమ జీవితంలో జరిగే చిన్న చిన్న సంతోషాలను, బాధలను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉంటారు.. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నువ్వు ఇక లేవు అన్న నిజాన్ని నా మనసు జీర్ణించుకోలేకపోతోంది అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు ధరమ్ తేజ్. మరి సాయిధరమ్ తేజ్ ఇంతలా దేనికి బాధపడుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సాయిధరమ్ తేజ్.. మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్ గా ఉంటాడు అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇక కెరీర్ ఆరంభంలో రొటీన్ కథలను తీసి కొన్ని హిట్లను, కొన్ని ఫెయిల్యూర్స్ ను చూశాడు. కానీ కొన్ని సినిమాల ఫలితాల తర్వాత తన రూట్ ను మార్చి, కొన్ని భిన్నమైన సినిమాలను చేశాడు. తాజాగా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు సాయిధరమ్ తేజ్. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన తేజ్ ను ఏంతో బాధపెట్టిందని చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏంటంటే?

సెలబ్రిటీలు పెట్స్ ను పెంచుకుంటారు అన్న విషయం అందరికి తెలిసిందే. అలాగే సాయిధరమ్ తేజ్ దగ్గర టాంగో అనే పెట్ డాగ్ ఉంది. ఆ కుక్కతో తేజ్ కు ఎంతో బాండింగ్ ఉంది. తాజాగా ఆ కుక్క చనిపోయింది. ఈ విషయాన్నే సోషల్ మీడియా ద్వారా చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు తేజ్.”నువ్వు లేవన్న నిజాన్ని నా మనసు తీసుకోలేకపోతోంది. నా బాధల్లో తోడున్నావు, నా సంతోషానికి కారణం అయ్యావు లవ్ యూ బండ ఫెల్లో టాంగో” అంటూ ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేశారు సాయిధరమ్ తేజ్. ఈ పోస్ట్ కు మంచు మనోజ్ కామెంట్ చేశారు. ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోతే గుండె బద్దలు అవుతుంది అంటూ తన సంతాపాన్ని తెలియజేశారు మనోజ్.

 

View this post on Instagram

 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet