iDreamPost

వీడియో: చైతూకి నిజంగానే ముద్దు పెట్టిందా? క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

Sai Pallavi On Kiss Scene: సాయి పల్లవి- నాగ చైతన్య హిట్టు కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వీళ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi On Kiss Scene: సాయి పల్లవి- నాగ చైతన్య హిట్టు కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వీళ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో: చైతూకి నిజంగానే ముద్దు పెట్టిందా? క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. వారి నటన, టాలెంట్, కెరీర్ కి సంబంధించి వాళ్లు పెట్టుకునే హద్దులు ఇలా అన్నీ ఎంతో యూనీక్ గా ఉంటాయి. అలాంటి వాళ్లలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకరు. కెరీర్ ని ఎలా గోలా ముందుకు తీసుకెళ్లడానికి తను సినిమాలు చేయడం లేదు. ఆ విషయాన్ని ఎప్పుడే బాహాటంగానే చెప్పుకొచ్చింది. పైగా ఆమె ఒక పాత్ర ఒప్పుకోవాలి అంటే చాలానే కండిషన్స్ ఉంటాయి. డ్రెస్సింగ్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, కొన్ని సీన్స్ విషయంలో కూడా సాయి పల్లవి ఎంతో స్ట్రిక్ గా ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్యకు ముద్దు పెట్టే సీన్ ఉంటుంది. మరి.. అక్కడ ఆమె నిజంగానే ముద్దు పెట్టిందా? సమాధానం స్వయంగా ఆమే చెప్పింది.

సాయి పల్లవికి పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. ఆమె నటన, డాన్స్, హావభావాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో సాయి పల్లవి కంటూ కొన్ని కండిషన్స్, కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని దాటి సాయి పల్లవి సినిమాల్లో నటించదు అనే విషయం అందరికీ తెలుసు. పొట్టి బట్టలు వేసుకోవడం, అభ్యంతరకర సీన్లలో నటించడంలాంటివి చేయదు. కానీ, లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్యకు ముద్దు పెట్టే సీన్ ఉంటుంది. దానికి సంబంధించి అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. సాయి పల్లవి ముద్దు పెట్టడం ఏంటి అని పెద్ద చర్చలే జరిగాయి. చాలామంది సాయి పల్లవి నిజంగానే ముద్దు పెట్టింది అని నమ్మకపోయినా విజువల్స్ మాత్రం అలాగే ఉన్నాయి. దాంతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు.

నిజానికి ఆ విషయంపై హీరోయిన్ అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తండేల్ లో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ కిస్ సీన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఆ రోజు షూటింగ్ లో జరిగింది ఏంటో చెప్పుకొచ్చింది. “నేను ముద్దు పెట్టను అని క్లియర్ గా చెప్పాను. నేను ముద్దు పెట్టను కాబట్టి అది జనాలకు అర్థం కాకుండా.. ముద్దు పెట్టినట్లు అనింపించేలా ఎలా చేయాలి అని శేఖర్ కమ్ముల, డీవోపీ గారు ఎంతో కష్టపడ్డారు. ఏ యాంగిల్ పెడితే ఉంటది కరెక్ట్ గా అని చాలానే కష్ట పడ్డారు. ముద్దు పెట్టకుండా ఉండటం అనేది నా కన్సర్న్ అని చెప్పచ్చు కదా” అంటూ సాయి పల్లవి అసలు విషయాన్ని వెల్లడించింది.

ఇప్పటివరకు ఆ సీన్ కి సంబంధించి ఉన్న ఎన్నో అనుమానాలను సాయి పల్లవి స్వయంగా నివృతి చేసినట్లు అయ్యింది. మొత్తానికి ఆ ముద్దు సీన్ మీద క్లారిటీ అయితే వచ్చింది. ఇంక వీళ్ల సినిమాల విషయానికి వస్తే.. మరోసారి సాయి పల్లవి- నాగ చైతన్య కాంబో రిపీట్ కాబోతోంది. తండేల్ అంటూ పాన్ ఇండియా చిత్రంలో ఈ సక్సెస్ కాంబో నటిస్తోంది. యధార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారని చెబుతున్నారు. దసరా సందర్భంగా తండేల్ చిత్రం అక్టోబర్ 11న విడుదల అవుతుందని ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ నడుస్తోంది. అక్టోబర్ 10న జూనియర్ ఎన్టీఆర్ దేవర వస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రిలీజ్ అంటే కాస్త రిస్క్ ఏమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by 𝗦 𝗔 𝗜 𝗣 𝗔 𝗟 𝗟 𝗔 𝗩 𝗜 ❤ (@sai_pallavi__fc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి