iDreamPost

ఆసీస్​పై సచిన్ విశ్వరూపానికి 16 ఏళ్లు.. కంగారూలతో చెడుగుడు ఆడుకున్నాడు!

  • Published Mar 02, 2024 | 5:51 PMUpdated Mar 02, 2024 | 5:51 PM

కెరీర్​లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. అయితే సరిగ్గా 16 ఏళ్ల కింద ఇదే రోజు ఆస్ట్రేలియాపై అతడు తన విశ్వరూపాన్ని చూపించాడు.

కెరీర్​లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. అయితే సరిగ్గా 16 ఏళ్ల కింద ఇదే రోజు ఆస్ట్రేలియాపై అతడు తన విశ్వరూపాన్ని చూపించాడు.

  • Published Mar 02, 2024 | 5:51 PMUpdated Mar 02, 2024 | 5:51 PM
ఆసీస్​పై సచిన్ విశ్వరూపానికి 16 ఏళ్లు.. కంగారూలతో చెడుగుడు ఆడుకున్నాడు!

క్రికెట్​లో ఆస్ట్రేలియా పెత్తనం చెలాయిస్తున్న రోజులవి. వరల్డ్ కప్​తో పాటు ఏ టోర్నీలోనైనా ఆసీస్​తో ఆడాలంటేనే అందరూ భయపడేవారు. ఆ టీమ్​లో డేంజరస్ బ్యాటర్లు, టాప్ క్వాలిటీ బౌలర్లు, ఆల్​రౌండర్లు ఉండేవారు. ఒకవేళ అవతలి జట్టు గెలిచేందుకు పోరాటం చేసి విజయానికి దగ్గరగా వచ్చినా కంగారూ టీమ్ చివరి ఓవర్లలో కూడా మ్యాచ్​ను తమ వైపునకు తిప్పుకునేది. అటాకింగ్ బ్యాటింగ్, అంతే దూకుడైన బౌలింగ్, ఫీల్డింగ్​తో ప్రత్యర్థి జట్లను వణికించేది ఆసీస్. అయితే ఆ టీమ్​కు ఎన్నోసార్లు ముకుతాడు వేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆ రోజు మరోమారు చెలరేగిపోయాడు. ఆసీస్​పై తన విశ్వరూపాన్ని చూపించాడు. కంగారూ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. అజేయ శతకంతో సింగిల్ హ్యాండ్​తో టీమిండియాను గెలిపించాడు. ఆ రోజు అసలేం జరిగిందో మళ్లీ గుర్తుచేసుకుందాం..

2007-08లో కామన్​వెల్త్ సిరీస్​ ఫస్ట్ ఫైనల్​లో భాగంగా ఆస్ట్రేలియాతో సరిగ్గా ఇదే నెల, ఇదే తేదీన పోటీపడింది భారత్. ఆ మ్యాచ్​లో ఫేవరెట్​గా బరిలోకి దిగింది ఆసీస్. అయితే ఆ టీమ్​కు గట్టి షాకిచ్చింది టీమిండియా. ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కష్టసాధ్యం కాని లక్ష్యమే అయినా భీకర పేసర్లు బ్రెట్​లీ, నాథన్ బ్రాకెన్, మిచెల్ జాన్సన్​తో పాటు క్వాలిటీ స్పిన్నర్లు బ్రాడ్ హాడ్జ్, మైకేల్ క్లార్క్, ఆసీస్​లో ఉన్నారు. కీలక మ్యాచుల్లో తడబడే అలవాటు ఉండటంతో మన టీమ్ ఛేజ్ చేస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ మన బ్యాటర్లు భారత్​ను అలవోకగా గెలిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (117 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగిపోయాడు.

మిచెల్ జాన్సన్, హాడ్జ్, జేమ్స్ హోప్స్​ను టార్గెట్​గా చేసుకొని బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు సచిన్. మొత్తంగా 10 ఫోర్లు కొట్టిన మాస్టర్.. బ్రెట్​లీని కూడా వదల్లేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అతడి బౌలింగ్​లో వేగంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్యలో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. రోహిత్ శర్మ (66) సచిన్​కు చక్కటి సహకారం అందించాడు. చివర్లో ఎంఎస్ ధోని (15 నాటౌట్) అండతో టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు మాస్టర్ బ్లాస్టర్. సెంచరీ పూర్తయినా అడ్డగోలు షాట్లకు పోకుండా ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఆ రోజు సచిన్ విధ్వంసాన్ని ఆపలేక ఆసీస్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఆ మ్యాచ్​లో అతడ్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఆ టోర్నీలో సెకండ్ ఫైనల్స్​లోనూ ఆసీస్​ను మట్టికరిపించిన భారత్ కామన్​వెల్త్ బ్యాంక్ సిరీస్​ను కైవసం చేసుకుంది. మరి.. ఆస్ట్రేలియా మీద సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్​ మీకు గుర్తుంటే మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: స్ట్రీట్ క్రికెట్‌లా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్! బౌలర్‌ నిలబడి త్రో వేస్తూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి