iDreamPost
android-app
ios-app

ఫైనల్‌కి ముందు విరాట్‌ కోహ్లీకి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన సచిన్‌!

  • Published Nov 19, 2023 | 3:47 PMUpdated Nov 20, 2023 | 10:08 AM

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫైనల్‌కి ముందు విరాట్‌ కోహ్లీకి మరింత జోష్‌ పెంచేలా అదిరిపోయే పనిచేశాడు. సెమీస్‌లో 50 సెంచరీలు చేసి.. తన రికార్డును బ్రేక్‌ చేసి ఆ రికార్డును తనకే డెడికేట్‌ చేసిన కోహ్లీకి సచిన్‌ ఓ సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫైనల్‌కి ముందు విరాట్‌ కోహ్లీకి మరింత జోష్‌ పెంచేలా అదిరిపోయే పనిచేశాడు. సెమీస్‌లో 50 సెంచరీలు చేసి.. తన రికార్డును బ్రేక్‌ చేసి ఆ రికార్డును తనకే డెడికేట్‌ చేసిన కోహ్లీకి సచిన్‌ ఓ సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 19, 2023 | 3:47 PMUpdated Nov 20, 2023 | 10:08 AM
ఫైనల్‌కి ముందు విరాట్‌ కోహ్లీకి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన సచిన్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ హోరాహోరీ ఫైనల్‌లో విజయం సాధించిన జట్టు.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది. ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్‌ కప్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఒక వైపు, రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా మరోవైపు మరో కప్పు కోసం పోటీ పడుతున్నాయి. మరి.. ఆసీస్‌ ఆరో సారి కప్పు ఎత్తుతుందా? లేక టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడుతుందా అని యావత్‌ క్రికెట్‌ లోకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పైగా ఈ టోర్నీలో టీమిండియా సూపర్‌ ఫామ్‌లో ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడుతున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ సెంచరీతోనే వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. 49 సెంచరీలతో ఉన్న సచిన్‌ను వెనక్కి నెడుతూ.. 50 సెంచరీలతో ప్రపంచంలోనే అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే.. ఈ అరుదైన రికార్డును కోహ్లీ.. సచిన్‌కే అంకితం ఇవ్వడం విశేషం. ఆ మ్యాచ్‌ చూస్తూ గ్రౌండ్‌లోనే ఉన్న సచిన్‌కు.. తన 50 వన్డే సెంచరీని కోహ్లీ క్రికెట్‌ దేవుడికే డెడికేట్‌ చేశాడు.

అయితే.. ఆ మ్యాచ్‌ తర్వాత.. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చూసేందుకు అహ్మాదాబాద్‌కు వచ్చిన సచిన్‌ టెండూల్కర్‌ కోహ్లీ కోసం ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ తీసుకొచ్చాడు. 2011లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జెర్సీని కోహ్లీకి బహుమతిగా ఇచ్చాడు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండ్కూలర్‌. ఆ జెర్సీ అందుకున్న కోహ్లీ సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ వరల్డ్‌ కప్‌లో తాను ధరించిన జెర్సీనే కోహ్లీకి సచిన్‌ గిఫ్ట్‌గా ఇవ్వడం క్రికెట్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. అదే విన్నింగ్‌ సెంటిమెంట్‌తో ఈ కప్పు కూడా టీమిండియా గెలవాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి సచిన్‌ టెండూల్కర్‌.. కోహ్లీకి తన జెర్సీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి