iDreamPost

నిహారిక మెచ్చిన మూవీ నేరుగా OTTలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

క్రైమ్, హారర్, థ్రిల్లర్ జోనర్ మూవీలనే కాదూ.. హార్ట్ టచింగ్ కంటెంట్లను అందిస్తున్నాయి ఓటీటీలు. ఇప్పుడు అలాంటి షార్ట్ ఫిల్మిం ఒకటి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెచ్చిన ఈ చిత్రం..

క్రైమ్, హారర్, థ్రిల్లర్ జోనర్ మూవీలనే కాదూ.. హార్ట్ టచింగ్ కంటెంట్లను అందిస్తున్నాయి ఓటీటీలు. ఇప్పుడు అలాంటి షార్ట్ ఫిల్మిం ఒకటి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెచ్చిన ఈ చిత్రం..

నిహారిక మెచ్చిన  మూవీ నేరుగా OTTలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

ఓటీటీని వేదికగా చేసుకుని కెరీర్ ప్రారంభిస్తున్నారు కొంత మంది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, డైరెక్టర్స్. దీంతో మంచి కథలు వస్తున్నాయి. విభిన్నమైన కథాంశాలను అందిస్తున్నారు. మనస్సుకు హత్తుకు పోయే, మెలిపెట్టే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఓ ఇండిపెండెంట్ మూవీనే సాగు. రైతుకు సంబంధించిన సమస్యలను,  వాటిని ఎదుర్కొనే పరిస్థితుల గురించి చూపించారు ఇందులో. కాగా, ఈ షార్ట్ మూవీ ఓటీటీలో రాబోతుంది. రిలీజ్ కు ముందు ఈ చిత్రం దాదా ఫాల్కే సాహెబ్ ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ స్క్రీనింగ్ చూసి.. ప్రజెంటర్‌గా మారారు మెగా ఇంటి వారసురాలు కొణిదెల నిహారిక. ఇది నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది.

సాగు సినిమాలో వంశీ తుమ్మల, హారిక బల్ల హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. వినయ్ రత్నం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్.. మార్చి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది. సాగు చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సోనీ, టాటా స్కై బింగ్, హంగామా, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్స్, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, విఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎంఐ, ఎల్జి, 1+ టీవీ, క్లౌడ్ వాకర్, వాచో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇక ఈ మూవీ 4 రోజుల్లో పూర్తి చేశారు. 51 నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతుందని నిహారిక వెల్లడించారు.

కాగా, ఈ షార్ట్ మూవీ కోసం పని చేసింది.. 27 ఏళ్ల లోపు వాళ్లు కావడం విశేషం. కాగా, తనకు స్క్రీనింగ్ చూసి..సినిమా నచ్చి.. ప్రజెంటర్ గా మారినట్లు చెప్పారు నిహారిక. ఇది ఓ రైతు కథ అని చెప్పాడు దర్శకుడు వినయ్ రత్నం. హరిబాబు, సుబ్బలక్ష్మిల కథ. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వారికి ఉన్న బీడు భూమికి ఎలా నీళ్లు తెచ్చుకున్నారు అనే కథను చూపించాడు. చివరకు రైతుకు ఆత్మహత్య శరణ్యం కాదనే కాన్సెప్ట్ ఈ మూవీ ద్వారా చూపించినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 4 నుండి పలు ఓటీటీ ఛానల్స్ ప్రసారం కానుంది. ఈ సాగు పొట్టి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు యశస్వి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి