iDreamPost

Ruturaj Gaikwad: MPLలో రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్! ఫోర్లు, సిక్సర్లతో..

IPL 2024 ఫామ్ ను కొనసాగిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. తాజాగా కొల్హాపూర్ టస్కర్స్ తో జరిగిన మ్యాచ్ లో థండర్ బ్యాటింగ్ తో అలరించాడు.

IPL 2024 ఫామ్ ను కొనసాగిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. తాజాగా కొల్హాపూర్ టస్కర్స్ తో జరిగిన మ్యాచ్ లో థండర్ బ్యాటింగ్ తో అలరించాడు.

Ruturaj Gaikwad: MPLలో రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్! ఫోర్లు, సిక్సర్లతో..

టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ తన ఐపీఎల్ 2024 ఫామ్ ను అలాగే కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో పూణేరి బప్పాకు సారథ్యం వహిస్తున్నాడు గైక్వాడ్. ఈ క్రమంలోనే తాజాగా ఈ లీగ్ లో భాగంగా కొల్హాపూర్ టస్కర్స్ తో జరిగిన మ్యాచ్ లో థండర్ ఫిప్టీతో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించాడు.

ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోతున్నాడు. ఈ లీగ్ లో పూనేరి బప్పాటీమ్ కు సారథ్యం వహిస్తున్నాడు. ఇక ఈ లీగ్ లో భాగంగా నిన్న(జూన్ 4)న కొల్హాపూర్ టస్కర్స్ తో జరిగిన మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. వర్షం కారణాంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ మెరుపు బ్యాటింగ్ తో నిర్ణీత 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. జట్టులో గైక్వాడ్ మినహా ఎవ్వరూ రాణించలేదు.

అనంతరం 144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టస్కర్స్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 121 రన్స్ మాత్రమే చేసింది. దాంతో 23 రన్స్ తో గైక్వాడ్ టీమ్ విజయం సాధించింది. అయితే ఇంతకు ముందు మ్యాచ్ లో సైతం రుతురాజ్ ధనాధన్ బ్యాటింగ్ తో సత్తా చాటాడు. ఈగల్ నాసిక్ తో జరిగిన మ్యాచ్ లో సైతం 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 38 రన్స్ చేశాడు. అయితే ఎప్పుడూ ఓపెనర్ గా దిగే రుతురాజ్.. ఈ లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో సెకండ్  లీడింగ్ స్కోరర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అతడు 14 మ్యాచ్ ల్లో ఓ శతకం, నాలుగు అర్థశతకాలతో 583 పరుగులు చేసి.. విరాట్ కోహ్లీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మరి ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ.. చెలరేగిపోతున్న రుతురాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి