iDreamPost

LPG సిలిండర్ 500 కే పొందాలంటే ఇలా చేయాలా?

Telangana, Gas Cylinder: ప్రస్తుతం గ్యాస్ ధర సామాన్యుడికి గుది బండగా మారింది. నిత్యవసర వస్తువులతో పాటు ఈ గ్యాస్ బండ ధరతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ను ఇవ్వనుంది.

Telangana, Gas Cylinder: ప్రస్తుతం గ్యాస్ ధర సామాన్యుడికి గుది బండగా మారింది. నిత్యవసర వస్తువులతో పాటు ఈ గ్యాస్ బండ ధరతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ను ఇవ్వనుంది.

LPG సిలిండర్ 500 కే పొందాలంటే ఇలా చేయాలా?

నేటికాలంలో ప్రతి వస్తువు ధర ఆకాశం వైపే చూస్తందే తప్పా.. నేలవైపు చూడటం లేదు. నిత్యవసర వస్తువుల నుంచి ఇంధనాల వరకు ప్రతి దాని ధర ఎక్కువగా ఉంటుంది. ఇక గ్యాస్ సిలిండర్  అయితే సామాన్యుడికి గుదిబండగా మారింది. అందుకే గ్యాస్ ధర తగ్గిందనే వార్త వినిపిస్తే చాలు.. సామాన్యల కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఇటీవలే కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారెంటీల స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరు గ్యారెంటీల్లో గ్యాస్ సిలిండర్ పై కూడా ఆ హామీ ఇచ్చారు. కేవలం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. వాటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారం రాగానే తొలి గ్యారంటీగా స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక బస్సులో మహిళలు ప్రయాణించేందుకు తమ ఆధార్ కార్డును చూపించవలసి ఉంటుంది. కాంగ్రెసే చేపట్టిన ఈ స్కీమ్ కు అపూర్వ స్పందన వస్తుంది. మహిళలు ఎక్కువ శాతం మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడి కనిపిస్తున్నాయి.

ఇలా కాంగ్రెస్ చేపట్టిన మరో గ్యారెంటీ స్కీమ్.. రూ.500కే గ్యాస్ సిలిండర్. ఈ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. అలానే తాజాగా ఆ స్కీమ్ ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో ఓ  రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ పథకం కోసం ఈ కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదనే వదంతు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఆందోళనకు గురైన చాలా మంది మహిళలందరూ ఆధార్ కార్డులతో గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. అయితే కేంద్ర ఇంధనాలు, సహజ వనరుల మంత్రిత్వ శాఖ మహిళలందరూ ఈ కేవైసీ కానీ వారు వెంటనే చేయించుకోవాలని పేర్కొంది. అయితే ఆ ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎటువంటి సంబంధం లేదు.

చాలా మంది సబ్బిడీ రావాలంటే చేయించుకోలానే ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో తమకి ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ సిలిండర్ రాదనుకుని చాలా మంది మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అటువంటి ఏమీ లేదని కేవలం ఈకేవైసీ పూర్తికాని వారికి మాత్రమే కేవైసీ చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ లో గ్యాస్ లబ్ధిదారులు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని కోరుతున్నారు.  ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 960కి అటు.. ఇటుగా నడుస్తోంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి