iDreamPost
android-app
ios-app

RTPCR కిట్ – 50 నిమిషాల్లోనే మంకీపాక్స్ నిర్థారణ

RTPCR కిట్ – 50 నిమిషాల్లోనే మంకీపాక్స్ నిర్థారణ

కరోనా వైరస్ గోడవ పోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆ పేరు హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు కరోనాకు తోడు మంకీపాక్స్ పేరుతో మరో కొత్త వైరస్ అందరినీ కలవరపెడుతోంది. తాజాగా ఈ వైరస్ భారత్ లోనూ అడుగుపెట్టడంతో దీనికి సంబంధించిన ఆర్టీపీసీఆర్ కిట్ ను అందుబాటులోకి తెచ్చారు.

ఇప్పటికే నాలుగైదు కేసులు బయటపడగా, ఈ వ్యాధి నిర్థారణ కోసం జీన్స్ టుమి(Genes2Me) సంస్థ కిట్ ను తీసుకొచ్చింది. కచ్చితత్వంతో పాటుగా కేవలం 50 నిమిషాల వ్యవధిలోపే ఫలితాన్ని చెప్తుందని స్పష్టం చేసింది. దీన్నిల్యాబ్ లు, విమానాశ్రయాలు, ఆసుపత్రుల్లో ఉపయోగిస్తారని తెలిపంది.

ఈ మంకీపాక్స్ అనే వైరస్ ముందుగా పశ్చిమ ఆఫ్రికాలో మొదలైంది. అనంతరం వేగవంతంగా ఒక్కో దేశానికి వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 75 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో దీనిపై అత్యవసర స్థితిని సైతం ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

మంకీపాక్స్ వైరస్ తో ప్రజల్లో మరొసారి భయాందోళనలు మొదలయ్యాయి. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన ఎంతోమందికి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. అయితే ఈ వైరస్ తీవ్రత ఎంతలా ఉంటుంది? ప్రభావాలు, అనంతర పరిణామాలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి