iDreamPost

జేసీ మరోసారి దొరికిపోయారు

జేసీ మరోసారి దొరికిపోయారు

తన చేతివాటంతో మాజీ మంత్రి జే సీ దివాకర్‌ రెడ్డి మరోసారి దొరికిపోయారు. అక్రమంగా, అనధికారికంగా దివాకర్‌ ట్రావెల్స్‌ పేరుతో బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెట్టిన వ్యహారంలో 57 బస్సులను ఇప్పటికే ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. తాజాగా జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన నాలుగు టిప్పర్‌ లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు.

బీఎస్‌ 3 వాహనాలను.. బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారన్న సమాచారంతో దాడులు చేసిన ఆర్టీఏ అధికారులు.. తమకు వచ్చిన ఫిర్యాదు నిజమని నిర్థారించుకున్నారు. దివాకర్‌ రెడ్డికి సంబంధించిన నాలుగు టిప్పర్లను సీజ్‌ చేసిన ఆర్టీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు టిప్పర్లను ఆర్టీఏ అధికారులు కార్యాలయానికి తరలించారు.

గతంలో బస్సులను సీజ్‌ చేసిన సమయంలో జేసీ దివాకర్‌ రెడ్డి నానా యాగీ చేశారు. జగన్‌ తమ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. అంతేకానీ నిబంధనలను అనుసరించకుండా వాహనాలు నడుపుతున్నాననే విషయాన్ని మాత్రం మరిచిపోయారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ, గడచిన టీడీపీ ప్రభుత్వంలోనూ సాగించినట్లు ఇప్పుడు కూడా తన సామ్రాజ్యాన్ని దివాకర్‌ రెడ్డి కొనసాగించాలనుకుంటున్నట్లుగా తాజా బీఎస్‌ 3 టిప్పర్లను.. బీఎస్‌ 4 మార్చడం ద్వారా స్పష్టమవుతోంది. తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న సృహతో వ్యాపారాలు చేస్తే.. తప్పు చేశామన్న అపవాదులను జేసీ మూటకట్టుకోకుండా ఉంటారు. లేదంటే నష్టాలతోపాటు అవమానాలు బోనస్‌గా రావడం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి