iDreamPost

కింగ్‌ ఫిషర్‌ లవర్స్‌కి షాకింగ్‌ న్యూస్‌.. ఆ బీర్‌ తాగితే ప్రమాదం

  • Published Aug 17, 2023 | 2:42 PMUpdated Aug 17, 2023 | 5:53 PM
  • Published Aug 17, 2023 | 2:42 PMUpdated Aug 17, 2023 | 5:53 PM
కింగ్‌ ఫిషర్‌ లవర్స్‌కి షాకింగ్‌ న్యూస్‌.. ఆ బీర్‌ తాగితే ప్రమాదం

మన దేశంలో మెజారిటీ మందుబాబుల ఫేవరెట్‌ బ్రాండ్‌ కింగ్‌ ఫిషర్‌ అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఓ షాకింగ్‌ సంఘటన వెలుగు చూసింది. ఇది కింగ్‌ ఫియర్‌ బీర్‌ తాగే వారికి బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. తాజాగా అధికారులు కింగ్ ఫిషర్ బీర్‌లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) ఉన్నట్లు గుర్తించారు. ఉత్ప్రేరకం ఉన్న ఈ బీర్లను తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని హెచ్చరిస్తున్నారు. కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్‌గడ్‌లోని యునైటెడ్ బ్రూవరీస్‌లో 7సీ, 7ఈ బ్యాచ్ నంబర్‌తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో వెల్లడైంది.

జూలై 17 ,2023న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నంజన్‌గడ్ యూనిట్‌లో తయారు చేసిన బీర్లలలో ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నంజన్‌గడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జూలై 28న ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని కెమికల్ టెస్ట్ కోసం పంపారు. అతంతేకాక ల్యాబ్ టెస్ట్ రిపోర్టు వచ్చే వరకు స్టాక్‌ను సీజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక దీనికి సంబంధించిన ల్యాబ్‌ టెస్ట్‌ రిపోర్టు ఆగస్ట్ 2 న వచ్చింది. ఈ బీర్లలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడయ్యింది.

ఈ క్రమంలో 7సీ, 7ఈ బ్యాచ్ నంబర్‌తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లు వినియోగానికి పనికి రావని.. వాటిని తాగితే ప్రాణాలకు ప్రమాదమని పరీక్షల్లో తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో రసాయన పరీక్షల్లో విఫలమైన స్టాక్‌ను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది కర్ణాట​క ఎక్సైజ్ శాఖ. అక్కడ తయారైన సుమారు రూ.25 కోట్ల విలువైన 78,678 బీరు బాక్సులను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.

అయితే ఇప్పటి వరకు మొత్తం 78, 678 బాక్సుల బీర్లను ఉత్పత్తి చేయగా వాటిలో 45,500 బాక్స్‌లను ఇప్పటికే సరఫరా చేసినట్లు తెలిసింది. వీటిల్లో ఒక్క బెంగళూరులోనే దాదాపు 11వేల సీసాలు సప్లయ్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కింగ్ ఫిషర్ బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు వీటిని తయారుచేసిన యునైటెడ్ బ్రూవరీస్‌పై కేసు నమోదు చేశారు అధికారులు. తమ ఫేవరెట్‌ బ్రాండ్‌ కింగ్‌ఫిషర్‌ బీర్లలో ప్రమాదకర రసాయానలు ఉన్నట్లు తేలడంతో.. బీర్‌ లవర్స్‌ భయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి