iDreamPost

గెలిపిస్తాడని కోరి తెచ్చుకుంటే.. జట్టుకు భారంగా మారిన హార్దిక్ పాండ్యా!

RR vs Mi- Harthik Pandya Again Failed: ముంబయి జట్టుకు బలంగా ఉంటాడని.. గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా జట్టుకు భారంగా మారుతున్నాడు అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

RR vs Mi- Harthik Pandya Again Failed: ముంబయి జట్టుకు బలంగా ఉంటాడని.. గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా జట్టుకు భారంగా మారుతున్నాడు అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

గెలిపిస్తాడని కోరి తెచ్చుకుంటే.. జట్టుకు భారంగా మారిన హార్దిక్ పాండ్యా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రాను రాను జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా మారిపోతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని కోణాల్లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన నామమాత్రంగానే సాగుతోంది. అద్భుత ప్రదర్శన చేసినా కూడా.. విజయాలు దక్కకుండా పోతున్నాయి. జట్టులో ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తే.. మిగిలిన వాళ్లు ఫ్లాప్ అవుతున్నారు. అటు హార్దిక్ పాండ్యా కూడా అదే కోవలో ఉన్నాడు. అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా.. అదనంగా బౌలర్ గా కూడా హార్దిక్ పాండ్యా వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ ప్రదర్శన విషంలో అదే రిపీట్ అయ్యింది.

హార్దిక్ పాండ్యాని జట్టుకు బిగ్ అసెట్ అవుతాడని యాజమాన్యం ఏరి కోరి ట్రేడ్ విధానంలో తెచ్చి కెప్టెన్ ని చేసుకుంది. కానీ, హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం నచ్చని అభిమానులు నానా హంగామా చేశారు. అవన్నీ కాస్త సర్దుకున్నాయిలే అనుకుంటే.. జట్టు ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. హార్దిక్ పాండ్యా మాత్రం వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అటు కెప్టెన్ గా కూడా హార్దిక్ పాండ్యా చేస్తున్న అద్భుతాలు ఏమీ కనిపించడం లేదు. మ్యాచ్ అటు ఇటుగా ఉంటే.. రోహిత్ రంగంలోకి దిగి ఫీల్డ్ సెట్ చేయడం, బౌలర్ తో మాట్లాడటం చేస్తున్నాడు. సరే బ్యాటుతో నైనా అద్భుతాలు చేస్తాడని ఎదురు చూస్తున్న ముంబయి ఫ్యాన్స్ కి అలా కూడా ఆనందం లేకుండా పోతోంది. తాజాగా జరిగిన రాజస్థాన్ మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. ఇది హార్దిక్ పాండ్యాకి వందో మ్యాచ్ కావడం విశేషం.

అర్ధ శతకాలు, శతకాలు కొడుతూ రాణించకపోయినా మినిమం స్కోర్ కూడా చేయకుండా హార్దిక్ నిరాశ పరుస్తున్నాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా ప్రదర్శన చూస్తే.. ముంబయి జట్టుకి హార్దిక్ పాండ్యా బలం కాదు.. భారం అంటున్నారు. ఇంక ఈ మ్యాచ్ చూస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు టాపార్డర్ తడబడింది. రోహిత్ శర్మ(6), ఇషాన్ కిషన్(0), సూర్య కుమార్ యాదవ్(10), తిలక్ వర్మ(65), నబీ(23), నేహాల్ వధేరా(49), హార్దిక్(10), టిమ్ డేవిడ్(3), కోయిటీజ్(గోల్డెన్ డక్), చావ్లా(1), బుమ్రా(2) పరుగులు మాత్రమే చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేశారు. ఇంక రాజస్థాన్ బాల్ తో మెప్పించింది. సందీప్ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు. బౌల్ట్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్- చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా ముంబయి జట్టుకి బలమా? భారమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి