iDreamPost

Rohit Sharma: చెన్నై లోకి రోహిత్ శర్మ.. షాకింగ్ హింట్ ఇచ్చిన రోహిత్ భార్య

రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్తున్నట్లు షాకింగ్ హింట్ ఇచ్చింది రోహిత్ భార్య రితికా సజ్దే. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్తున్నట్లు షాకింగ్ హింట్ ఇచ్చింది రోహిత్ భార్య రితికా సజ్దే. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: చెన్నై లోకి రోహిత్ శర్మ.. షాకింగ్ హింట్ ఇచ్చిన రోహిత్ భార్య

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు టీమ్ పగ్గాలను అందించిన సంగతి తెసిందే. దీంతో రోహిత్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఇక రోహిత్ ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించడంతో.. అతడి నెక్ట్స్ స్టెప్ ఏంటి? అంటూ అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీల్లోకి హిట్ మ్యాన్ వెళ్తాడని, అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తాడని తెలుస్తోంది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయానా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే. రోహిత్ ను కెప్టెన్ నుంచి తొలగించడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దానికి రోహిత్ భార్య రితికా ఎల్లో కలర్ లోని లవ్ సింబల్ ను కామెంట్ గా పెట్టింది. దీంతో అతడు సీఎస్కేలోకి వెళ్తున్నాడని చెప్పకనే చెప్పిందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

రోహిత్ శర్మ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారాడు. దానికి కారణం మనందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై లోకి రావడం.. అతడిని తీసుకున్న వెంటనే కెప్టెన్ గా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయంపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాండ్యా క్యాష్ ఆన్ డీల్ జరిగే క్రమంలోనే తనకు కెప్టెన్ పగ్గాలు ఇస్తేనే జట్టులోకి వస్తాను అంటూ కండిషన్ పెట్టాడట. దీంతో ముంబై ఆ కండిషన్ కు ఒప్పుకునే అతడిని జట్టులోకి తీసుకుని లాంఛనంగా సారథిగా ప్రకటించింది. ఇక ఈ విషయం రోహిత్ కు కూడా చెప్పినట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో హిట్ మ్యాన్ ఫ్రాంచైజీ మారుతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఒకవేళ రోహిత్ భాయ్ బయటకి వస్తే.. ఏ టీమ్ లోకి వెళ్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో షాకింగ్ హింట్ ఇచ్చింది రోహిత్ భార్య రితికా సజ్దే. రోహిత్ ను కెప్టెన్ గా తొలగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో 2013 నుంచి 2023 వరకు ఈ దశాబ్దంలో అద్బుతమైన స్పిరిట్ ఉన్న నాయకుడు రోహిత్ శర్మ, అతడికి తగిన గౌరవం ఇస్తున్నాం అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కు రోహిత్ భార్య రితికా సజ్దే చేసిన కామెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెన్నై చేసిన పోస్ట్ కు రితికా ఎల్లో కలర్ లవ్ సింబల్ ను కామెంట్ గా చేసింది. దీంతో హిట్ మ్యాన్ చెన్నైలోకి వెళ్తున్నాడా? అంటూ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇదే జరిగితే ధోని-రోహిత్ లు ఇద్దరు చెన్నై టీమ్ ను అదిరిపోయే రేంజ్ లో ముందుకు తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన భర్తకు సపోర్ట్ గా గౌరవంతో పోస్ట్ పెట్టినందుకే రితికా అలా కామెంట్ పెట్టిందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రితిక అలా కామెంట్ పెట్టడం మీకేవిధంగా అనిపించిందో

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి