SNP
SNP
మరికొన్ని వారాల్లో భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. దీని కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ తమ వ్యూహాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. కప్ కొట్టడమే లక్ష్యంగా టీమ్‌ను రెడీ చేసుకుంటున్నాయి. ఇప్పటికే టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన ఆస్ట్రేలియా లాంటి జట్టు తమ వరల్డ్ కప్ టీమ్‌ను సూచన ప్రాయంగా ప్రకటించింది. ఇక టీమిండియా కూడా స్వదేశంలో జరిగే వరల్ట్ గెలవడమే లక్ష్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లకు రెస్ట్ ఇస్తూ.. యువ క్రికెటర్లను ట్రైన్ చేస్తోంది. అలాగే గాయాల పాలైన క్రికెటర్లను తిరిగి ఫీట్ చేసేందుకు ఎన్‌సీఏలో ప్రత్యేక క్యాంప్ నడుపుతోంది.
1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆ తర్వాత ఏకంగా 28 ఏళ్ల పాటు వరల్డ్ కప్ నిరీక్షించింది. మళ్లీ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో 2011లో మనదేశంలోనే జరిగిన వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచి, రెండో సారి విశ్వవిజేతగా అవతరించింది. మళ్లీ దశాబ్దం గడుస్తున్నా.. వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో.. ఈసారి కూడా స్వదేశంలోనే వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఆశలు రెకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్‌ని పట్టుకుని దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. దీనిపై కొంతమంది క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడున్న టీమ్‌తో ఇది కలగానే మిగిలిపోతుందని అంటున్నారు.
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలు కావడంతో క్రికెట్ అభిమానులు జట్టుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి టీమ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని, ఇప్పుడు వరల్డ్ కప్‌తో దిగిన ఫొటో తీపి గుర్తుగా మిగిలిపోతుంది తప్పా.. నిజంగానే అది మన సొంత కాదని పేర్కొంటున్నారు. నిజానికి వాళ్ల వ్యాఖ్యలు కూడా మరీ కొట్టిపారేసేలా లేవు. ఎందుకంటే రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆడితేనే వరల్డ్ కప్ రాదు. జట్టు మొత్తం బాగా ఆడితేనే విశ్వవిజేతగా నిలిచేది. 2011 టీమ్‌నే తీసుకుంటే.. అది స్పష్టంగా తెలుస్తుంది. అయితే.. రోహిత్, కోహ్లీ, జడేజా, సిరాజ్, బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నా.. వారికి యువ క్రికెటర్లు కూడా తోడు కావాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian skipper Rohit Sharma with the prestigious World Cup 2023 trophy. 🏆
📷: ICC#RohitSharma #IndianCricket #WorldCup2023 #SportsKeeda pic.twitter.com/yKcUtS3oIF
— Sportskeeda (@Sportskeeda) August 7, 2023
ఇదీ చదవండి: వీళ్లను నమ్ముకుంటే.. టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందా?