iDreamPost

Rohit Sharma: కావాల్సింది కేవలం 18.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు!

  • Published Jan 10, 2024 | 1:29 PMUpdated Jan 10, 2024 | 8:11 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పి.. ఇప్పటి వరకు మరే క్రికెటర్‌ చేయమని విధంగా సరికొత్త చరిత్ర లిఖించేందుకు రెడీ అవుతున్నాడు. మరి రోహిత్‌ను ఊరిస్తున్న ఆ ప్రపంచ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పి.. ఇప్పటి వరకు మరే క్రికెటర్‌ చేయమని విధంగా సరికొత్త చరిత్ర లిఖించేందుకు రెడీ అవుతున్నాడు. మరి రోహిత్‌ను ఊరిస్తున్న ఆ ప్రపంచ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 10, 2024 | 1:29 PMUpdated Jan 10, 2024 | 8:11 PM
Rohit Sharma: కావాల్సింది కేవలం 18.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పిచ్‌పైనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎదురుగా ఎంత తోపు బౌలర్‌ ఉన్నా.. మంచినీళ్లు తాగినంత సులువుగా భారీ షాట్లు ఆడగల సత్తా రోహిత్‌ శర్మ సొంత​ం. అతను అంత భీకరమైన బ్యాటింగ్‌ చేస్తాడు కాబట్టే.. మోస్ట్‌ డేంజరస్‌ ఓపెనర్‌గా ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు రోహిత్‌ పేరిటే ఉంది. శ్రీలంకతో జరిగిన 2014లో జరిగిన వన్డేలో ఏకంగా 264 పరుగులు బాదాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇంత భారీ స్కోర్ ఏ క్రికెటర్‌ చేయలేదు. ఇప్పటికే ఇదే వరల్డ్‌ రికార్డ్‌. ఆ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 ఫోర్లతో రోహిత్‌ విలయతాండవం చేశాడు. మొదటి నుంచి రోహిత్‌ శర్మ సిక్సులు చాలా సులువుగా కొడుతుంటాడు.

ఈ క్రమంలోనే ఒక అరుదైన వరల్డ్‌ రికార్డుకు రోహిత్‌ శర్మ చేరువయ్యాడు. రోహిత్‌ మరో 18 సిక్సులు బాదితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సులు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. సిక్సులత సిక్స్‌ హండ్రెడ్‌ మార్క్‌ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. సచిన్‌ వంద సెంచరీల మార్క్‌ అందుకుంటే.. క్రికెట్‌ అభిమానులంత ఎంత సంతోషించారో.. ఇప్పుడు రోహిత్‌ శర్మ 600వ సిక్స్‌ కొట్టినా అంతే హ్యాపీ అవుతారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. 600 సిక్సులు.. అందులోనా అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న విషయం కాదు. చాలా మంది క్రికెటర్లు ఈ ఫీట్‌ను కలలో కూడా ఊహించి ఉండరు.

History as the first cricketer

అలాంటి రోహిత్‌ శర్మ ఈ అరుదైన ప్రపంచ రికార్డుకు కేవలం 18 సిక్సుల దూరంలో ఉన్నాడు. అయితే.. గురువారం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ శర్మ బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లోనే రోహిత్‌.. 600 సిక్సుల మార్క్‌ను అందుకుంటాడని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓపెనర్‌గా చాలా అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌.. ఇక టీ20లంటే ఆడుతాడా? మూడు మ్యాచ్లులో రెండు మంచి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడినా చాలు.. 18 సిక్సులు ఈజీగా బాదేస్తాడని భారత క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు రోహిత్‌.. 54 టెస్టుల్లో 77 సిక్సులు, 262 వన్డేల్లో 323 సిక్సులు, 148 టీ20ల్లో 182 సిక్సులు బాదాడు.  మరి రోహిత్‌ శర్మ.. 600 సిక్సులకు దగ్గరవ్వడంతో పాటు.. ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లోనే ఈ రికార్డును అందుకుంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి