iDreamPost
android-app
ios-app

రోహిత్‌కి MIని గెలిపించడం ఇష్టం లేదా? చివరిలో ఆ నిర్ణయం? ఇది సంచలనం!

  • Published Apr 15, 2024 | 1:46 PM Updated Updated Apr 15, 2024 | 5:09 PM

Rohit Sharma, CSK vs MI, IPL 2024: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. ఈ ఓటమికి రోహిత్‌ శర్మ కారణం అనే వాదన వినిపిస్తోంది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, CSK vs MI, IPL 2024: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. ఈ ఓటమికి రోహిత్‌ శర్మ కారణం అనే వాదన వినిపిస్తోంది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 15, 2024 | 1:46 PMUpdated Apr 15, 2024 | 5:09 PM
రోహిత్‌కి MIని గెలిపించడం ఇష్టం లేదా? చివరిలో ఆ నిర్ణయం? ఇది సంచలనం!

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో రాణించి.. చివరి వరకు క్రీజ్‌లో నాటౌట్‌గా మిగిలినా ముంబై ఓటమి పాలు కావడంతో రోహిత్‌ శర్మపై విమర్శలు వస్తున్నాయి. రోహిత్‌ శర్మ స్లో బ్యాటింగ్‌ ముంబై ఇండియన్స్‌ కొంపముంచిందని చాలా మంది క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులు చేశాడు. ప్లేవర్‌ ప్లేలో మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌తో కలిసి విధ్వంసం సృష్టించిన రోహిత్‌ శర్మ.. 6 ఓవర్లలోనే జట్టు స్కోర్‌ను 63 పరుగులకు చేర్చాడు. అప్పటికీ ముంబై ఒక్క వికెట్‌ కూడా కోల్పోలేదు. ఇంత పటిష్టస్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్‌ 20 రన్స్‌ తేడాతో ఓడిపోయింది.

అయితే.. ఈ మ్యాచ్‌ను గెలిపించడం రోహిత్‌ శర్మకు ఇష్టం లేదని, అందుకే కావాలని ఉద్దేశపూర్వంగా మ్యాచ్‌లో స్లోగా ఆడి.. ముంబై ఇండియన్స్‌ ఓడిపోయేలా చేశాడనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఆరోపణలే కాదు.. వాటికి అంకెలతో సహా చూపిస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. 49 బంతుల్లో 77 పరుగులు చేసి.. మరి జోష్‌లో ఉన్న రోహిత్‌.. ఆ తర్వాత సడెన్‌గా తన బ్యాటింగ్‌ స్పీడ్‌ తగ్గించేశాడు. తర్వాత 17 పరుగులు చేసేందుకు ఏకంగా 17 బంతులు తీసుకున్నాడు. రోహిత్‌ శర్మ వేగంగా ఆడకపోవడంతో.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో 6, 14వ ఓవర్‌లో 6, 15వ ఓవర్‌లో కేవల​ం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే.. ఈ ఓవర్స్‌లో మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లు కూడా ఎక్కువగా డాట్‌ బాల్స్‌ ఆడాడు. ఇదే ఈ మిడిల్‌ ఓవర్సే ముంబై ఇండియన్స్‌ కొంపముంచాయని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

Didn't Rohit want MI to win yesterday

అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కావాలని ఉద్దేశపూర్వంగా స్లోగా ఆడి ముంబై ఇండియన్స్‌ను ఓడించడానే విషయంలో ఎలాంటి నిజం లేకపోయినా.. కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. పైగా రోహిత్‌ శర్మ లాంటి విధ్వంసకర ఆటగాడు ఫస్ట్‌ ఓవర్‌ నుంచి లాస్ట్‌ ఓవర్‌ వరకు క్రీజ్‌లో ఉండి, సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఓడిపోవడం మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితి రోహిత్‌ శర్మకు కూడా మొదటిసారే అని చెప్పవచ్చు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 69 రన్స్‌తో అదరగొట్టాడు. శివమ్‌ దూబే 68 రన్స్‌, ధోని 4 బంతుల్లో 3 సిక్సులతో 20 పరుగులు చేసి రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ పాండ్యా 2 వికెట్లతో రాణించాడు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి 20 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌పై అలాగే అతనిపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.