iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న రోహిత్‌! ఇలాంటివి రేర్‌

  • Published Feb 05, 2024 | 11:30 AM Updated Updated Feb 05, 2024 | 4:08 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నా.. ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా స్లిప్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే. ఆ క్యాచ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నా.. ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా స్లిప్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే. ఆ క్యాచ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

  • Published Feb 05, 2024 | 11:30 AMUpdated Feb 05, 2024 | 4:08 PM
Rohit Sharma: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న రోహిత్‌! ఇలాంటివి రేర్‌

విశాఖపట్నం వేదికగా భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. ఇరుజట్లు గెలుపు కోసం పోరాడుతున్నాయి. అయితే.. ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఈ రోజే మ్యాచ్‌ ఫలితం తేలే ఛాన్స్‌ ఉంది. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేస్తే.. ఇండియా, ఆలౌట్‌ కాకుండా 399 రన్స్‌ చేస్తే ఇంగ్లండ్‌ మ్యాచ్‌ గెలుస్తాయి. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసే క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక్క అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. స్లిప్స్‌లో క్యాచ్‌ అందుకోవడం రోహిత్‌కు సర్వసాధారణమే అయినా.. ఈ క్యాచ్‌ మాత్రం చాలా స్పెషల్‌. ఎందుకంటే.. అస్సలు ఊహించని విధంగా వచ్చిన బాల్‌ను రెప్పపాటు కాలంలో మెరుపు వేగంతో రోహిత్‌ స్పందించి అందుకున్న ఆ క్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల మనసు దోచుకోవడం ఖాయం. ఈ సూపర్‌ క్యాచ్‌.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌లో చోటు చేసుకుంది.

399 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేస్తున్న క్రమంలో ఇంగ్లండ్‌ 132 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో 29వ ఓవర్‌ వేయడానికి వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలి టెస్ట్‌ హీరో ఓలీ పోప్‌ను బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని పోప్‌ కట్‌ షాట్‌ ఆడే క్రమంలో బాల్‌ ఎడ్జ్‌ తీసుకుంది. వికెట్‌ కీపర్‌ పక్కనుంచి స్లిప్‌ వైపు బాల్‌ దూసుకెళ్లింది. స్లిప్‌లో నిల్చున్న రోహిత్‌ బాల్‌ వస్తున్న వేగానికి ముందుగా తన కుడి వైపుకు కదిలాడు. కానీ, బాల్‌ ఎడమ వైపు రావడంతో.. బుల్లెట్‌లా వెళ్తున్న బాల్‌ను మెరుపువేగంతో స్పందించి అందుకున్నాడు. బ్యాట్‌కు తగిలి, రోహిత్‌ చేతుల్లో కేవలం 0.45 సెకన్స్‌లోనే బాల్‌ పడిపోయింది. రియాక్షన్‌ టైమ్‌ ఒక సెకను కంటే కూడా తక్కువ ఇంత తక్కువ టైమ్‌లో రోహిత్‌ స్పందించి అందుకోవడం నిజంగా అద్భుతం. ఈ క్యాచ్‌ అందుకున్న తర్వాత.. రోహిత్‌ సైతం అదే రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా 396 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 209 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను బుమ్ర వణికించాడు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 253 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుమ్రా ఏకంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌట్‌ అయింది. శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో రాణించినా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అయినా కూడా ఇంగ్లండ్‌ ముందు 399 పరుగుల టఫ్‌ టార్గెట్‌ను టీమిండియా ఉంచింది. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఛేదించేందుకు బజ్‌బాల్‌ స్ట్రాటజీని ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 140 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఆడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.