iDreamPost

ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రియాక్ట్‌ అయిన రోహిత్‌ శర్మ! ఏమన్నాడంటే?

  • Published Mar 22, 2024 | 11:13 AMUpdated Mar 22, 2024 | 11:13 AM

Rohit Sharma, MS Dhoni: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు ధోని ఊహించని షాకిచ్చాడు. సీఎస్‌కే కెప్టెన్నీ నుంచి తప్పుకుని.. ఆ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఇచ్చాడు. ఈ విషయంపై రోహిత్‌ శర్మ రియాక్ట్‌ అవ్వడం హైలెట్‌గా మారింది. మరి రోహిత్‌ ఏమని రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, MS Dhoni: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు ధోని ఊహించని షాకిచ్చాడు. సీఎస్‌కే కెప్టెన్నీ నుంచి తప్పుకుని.. ఆ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఇచ్చాడు. ఈ విషయంపై రోహిత్‌ శర్మ రియాక్ట్‌ అవ్వడం హైలెట్‌గా మారింది. మరి రోహిత్‌ ఏమని రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 22, 2024 | 11:13 AMUpdated Mar 22, 2024 | 11:13 AM
ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రియాక్ట్‌ అయిన రోహిత్‌ శర్మ! ఏమన్నాడంటే?

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేటి నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ అట్టహాసంగా మొదలవనుంది. రాత్రి 8 గంటలకు ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌తో ధనాధన్‌ క్రికెట్‌ టోర్నీ షురూ అవుతుంది. అయితే.. తొలి మ్యాచ్‌ ఆడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ఊహించని షాకిచ్చాడు. గురువారం అన్ని టీమ్స్‌ కెప్టెన్ల ఫొటో షూట్‌కి ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు వెల్లడించాడు. అప్పటికప్పుడు తన స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను సీఎస్‌కే కెప్టెన్‌గా ఫొటో షూట్‌కి పంపించాడు ధోని.

కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడం క్రికెట్‌ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే.. ఐపీఎల్‌ ఆరంభానికి చాలా రోజుల ముందు.. ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్ధిక్‌ పాండ్యాను నియమించింది. ఈ విషయం కూడా సంచలనంగా మారింది. రోహిత్‌ శర్మ అభిమానులు ముంబై మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా ముంబై వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ కూడా అయిష్టంగానే ముంబై ఇండియన్స్‌ తరఫున ఈ సీజన్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్‌ శర్మ రియాక్ట్‌ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. ధోనికి తాను గతంలో షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న ఫొటో పోస్ట్‌ చేసి.. కింద షేక్‌హ్యాండ్‌ ఎమోజీ పెట్టాడు.

ఈ సీజన్‌లో తాను కెప్టెన్సీ చేయడం లేదు.. ఇప్పుడు నువ్వు కూడా కెప్టెన్సీ వదిలేశావ్‌.. ఇట్స్‌ ఓకే అన్నట్లు ఆ పోస్ట్‌ అర్థమవుతుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. ఐపీఎల్‌ 2022 సీజన్‌కి ముందు ముండై ఇండియన్స్‌ను వీడి కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిన పాండ్యా.. ఏమైందో ఏమో కానీ, ఈ సీజన్‌కి ముందు మళ్లీ తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చేశాడు. వచ్చి రావడంతోనే అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింద ముంబై మేనేజ్‌మెంట్‌. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను కాదని.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయంపై రోహిత్‌ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రోహిత్‌ రియాక్ట్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి