SNP
Rohit Sharma, Harbhajan Singh: ప్రస్తుతం ఐపీఎల్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నా కూడా.. టీ20 వరల్డ్ కప్ కోసం కూడా ఆలోచిస్తున్నాడు. దాని కోసం పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి.. అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Harbhajan Singh: ప్రస్తుతం ఐపీఎల్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నా కూడా.. టీ20 వరల్డ్ కప్ కోసం కూడా ఆలోచిస్తున్నాడు. దాని కోసం పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి.. అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ కోసం భారత సెలెక్టర్లు ఇప్పటికే 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా టీమిండియా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొననుంది. 15 మంది జట్టుతో పాటు మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈ సారి ఎలాగైన టీ20 వరల్డ్ కప్ సాధించాలని టీమిండియా ఆటగాళ్లు కసితో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోకస్ మొత్తం టీ20 వరల్డ్ కప్‌పైనే ఉంది. గతేడాది మిస్ అయిన వన్డే వరల్డ్ కప్ బాధను టీ20 వరల్డ్ కప్ గెలిచి తీర్చుకోవాలని భావిస్తున్నాడు.
అయితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం టీ20 వరల్డ్ కప్ కోసం కలలు కనడమే కాదు అందుకోసం అవసరానికి మించి కష్టపడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పిచ్‌లు స్లో పిచ్‌లు, పైగా స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. పిచ్ నుంచి టర్న్ లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. రోహిత్ శర్మ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అందుకోసం ఏకంగా టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రంగంలోకి దింపాడు. నెట్స్‌లో భజ్జీతో బౌలింగ్ వేయిస్తూ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ ఈ రేంజ్‌లో ప్రాక్టీస్ చేస్తుండటంపై భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మకు గాయం అయినట్లు ఒక వార్త వైరల్ అయింది. రోహిత్ శర్మ స్వల్ప వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు పియూష్ చావ్లా వెల్లడించాడు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు రోహిత్‌కు గాయం అయితే.. అది టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, రోహిత్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది స్వల్ప నొప్పి కావడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ రోహిత్ గాయంపై అలాగే రోహిత్ శర్మ హర్భజన్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harbhajan Singh bowling to Rohit Sharma in the nets. 😄 pic.twitter.com/a7CPb2pYDc
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2024