iDreamPost

మ్యాచ్​లో ఓడినా ఆ విషయంలో క్లారిటీ వచ్చిందంటున్న రోహిత్!

  • Author singhj Published - 09:53 AM, Thu - 28 September 23
  • Author singhj Published - 09:53 AM, Thu - 28 September 23
మ్యాచ్​లో ఓడినా ఆ విషయంలో క్లారిటీ వచ్చిందంటున్న రోహిత్!

వరుస విజయాలతో ఫుల్ జోష్​ మీద ఉన్న టీమిండియా జోరుకు బ్రేకులు వేసింది ఆస్ట్రేలియా. మూడు వన్డేల సిరీస్​లో ఆసీస్​ను వైట్​వాష్ చేద్దామనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. ఆఖరి వన్డేలో కంగారూ చేతిలో మన టీమ్ 66 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. అయినా వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వ్యక్తిగతంగా తన పెర్పార్మెన్స్​ మీద సంతోషంగా ఉందన్నాడు. అన్ని విధాలుగా టీమ్​కు ఉపయోగపడే ఇన్నింగ్స్​లు ఆడాలన్నదే తన టార్గెట్ అని హిట్​మ్యాన్ చెప్పుకొచ్చాడు.

గత ఏడెనిమిది వన్డేల్లో భారత జట్టు ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నానని రోహిత్ అన్నాడు. డిఫరెంట్ సిచ్యువేషన్స్​లో ఎదురయ్యే ఛాలెంజ్​ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమయ్యామన్నాడు. వేర్వురు టీమ్స్​తో గ్రౌండ్​లోకి దిగామని.. అయితే కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యామని హిట్​మ్యాన్ పేర్కొన్నాడు. దురదృష్టవశాత్తూ ఆఖరి వన్డేలో ఓడిపోయామని.. అయినా ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్​కు అనుకూలంగా ఉన్న పిచ్ మీద బాగానే బౌలింగ్ చేశామన్నాడు రోహిత్. పేసర్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి గేమ్ అద్భుతమని మెచ్చుకున్నాడు.

బుమ్రా మునుపటిలా బౌలింగ్ చేయడం వల్ల భారత్​కు ఎంతో లాభం చేకూరుతోంది. బ్యాటింగ్ పిచ్ మీద కూడా బుమ్రా బౌలింగ్ ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ మొదట్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినా తర్వాత బాగా కంట్రోల్ చేశాడు. మెంటల్​గా, ఫిజికల్​గా అతడు దృఢమైన వ్యక్తి. ఒక మ్యాచ్​లో రన్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్ కాబోదు. వరల్డ్ కప్​ గురించి అంతా అడుగుతున్నారు. టీమ్​లోకి ఎవరు వస్తారు? ఏవైనా ఛేంజెస్ ఉంటాయా? అని డౌట్స్ రావడం కామనే. అయితే, ప్రపంచ కప్ కోసం 15 మందిపై మాకు ఫుల్ క్లారిటీ ఉంది. తప్పకుండా సూపర్బ్ టీమ్​తోనే బరిలోకి దిగుతాం. ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన రోల్​ను పోషించేందుకు రెడీగా ఉన్నారు. అప్పుడే మన జట్టు ఛాంపియన్​గా నిలవగలదు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: 24 ఏళ్లకే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాంగో మ్యాన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి