iDreamPost

VIDEO: రోహిత్ జోక్​కు పగలబడి నవ్విన కెప్టెన్లు.. బాబర్-బట్లర్ మాత్రం..!

  • Author singhj Published - 06:25 PM, Wed - 4 October 23
  • Author singhj Published - 06:25 PM, Wed - 4 October 23
VIDEO: రోహిత్ జోక్​కు పగలబడి నవ్విన కెప్టెన్లు.. బాబర్-బట్లర్ మాత్రం..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. హిట్​మ్యాన్ బ్యాటింగ్, కెప్టెన్సీ అంటే చాలా మందికి ఇష్టం. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడే రోహిత్​ బ్యాటింగ్​ను చూసేందుకు కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. గ్రౌండ్​ లోపల ఒక్కోసారి అగ్రెసివ్​గా, కొన్నిసార్లు కూల్​గా కనిపిస్తాడు హిట్​మ్యాన్. కానీ బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తాను నవ్వుతూ, సహచర ప్లేయర్లను నవ్విస్తూ ఉంటాడు. రోహిత్​లో ఫన్ యాంగిల్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్​ల సమయంలో అడిగే కొన్ని ప్రశ్నలకు హిట్​మ్యాన్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

తాజాగా మరోసారి అందర్నీ నవ్వించాడు రోహిత్ శర్మ. మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక వరల్డ్ కప్-2023 స్టార్ట్ అవనుంది. మెగా టోర్నీలో ఆడేందుకు అన్ని జట్లు భారత్​కు వచ్చేశాయి. ఒక్క టీమిండియా తప్ప అన్ని జట్లు వార్మప్ మ్యాచ్​లు ఆడాయి. భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్​లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే రోహిత్ సేన వరల్డ్ కప్​కు వెళ్తోంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ ఆరంభం నేపథ్యంలో అన్ని జట్ల సారథులతో కలిపి కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్ నిర్వహించింది ఐసీసీ.

కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అయితే ఈ ఈవెంట్​లో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక జోక్ కూడా వేసి అందర్నీ నవ్వించాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టుల్లో ఒకరు హిట్​మ్యాన్​ను ఓ ప్రశ్న అడిగారు. గత వరల్డ్ కప్​ ఫైనల్​లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లీష్ టీమ్​ను విజేతగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని రోహిత్​కు గుర్తుచేసిన ఆ జర్నలిస్ట్.. ఇంగ్లండ్​తో పాటు న్యూజిలాండ్​ను కూడా కలిపి సంయుక్తంగా విన్నర్​గా ప్రకటిస్తే బాగుండేదన్నారు.

ఇదే విషయంపై మీ అభిప్రాయం ఏంటని రోహిత్​ను అడిగారు జర్నలిస్ట్. దీంతో ఇది తనకు వేయాల్సిన ప్రశ్నేనా అంటూ నవ్వాడు రోహిత్. విజేత ఎవరో నిర్ణయించడం, ప్రకటించడం తన చేతుల్లో లేని పని అని అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న కెప్టెన్లు సహా అందరూ నవ్వారు. ఈ సంభాషణ అంతా హిందీలో జరిగింది. రోహిత్ జోక్ అర్థం కాకపోయినా అందరూ నవ్వారు. అయితే హిందీ రాకపోయినా ఇంగ్లండ్ అనే పదం వినిపించడంతో అసలు ఏం జరిగిందో తనకు చెప్పమని, ఇంగ్లీష్​లో ట్రాన్స్​లేట్ చేయాలని పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను జాస్ బట్లర్ కోరాడు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న గురించి బట్లర్​కు బాబర్ వివరించాడు. దీనికి బట్లర్ కూడా ఓకే అంటూ నవ్వేశాడు. పాక్ క్రికెటర్లకు హిందీ వచ్చుననే విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: KBCలో క్రికెట్​పై రూ.25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ క్రికెట్ లవర్స్​కూ తెలియదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి