SNP
మూడు టెస్టులో ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఐదో రోజు కొనసాగుతుందనుకున్న ఆట భారత బౌలర్ల దెబ్బకు నాలుగో రోజే ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో తీసుకున్న ఓ నిర్ణయంతో రోహిత్ ఇంగ్లండ్ అహాన్ని దెబ్బతీశాడు. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
మూడు టెస్టులో ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఐదో రోజు కొనసాగుతుందనుకున్న ఆట భారత బౌలర్ల దెబ్బకు నాలుగో రోజే ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో తీసుకున్న ఓ నిర్ణయంతో రోహిత్ ఇంగ్లండ్ అహాన్ని దెబ్బతీశాడు. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బజ్‌బాల్‌తో ఇండియాను ఓడిస్తామంటూ హెచ్చులకుపోయిన ఇంగ్లండ్ బజ్‌బాల్ బెండుతీస్తూ.. టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 122 పరుగులకే ఆలౌట్ చేసి.. ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందించారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ టీమిండియా అదిరిపోయే ప్రదర్శన చేసింది. దీంతో.. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు విజయాలతో 2-1తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా.. తర్వాతి రెండు వరుస టెస్టులు గెలిచి.. సత్తా చాటింది. అయితే.. రాజ్‌కోట్ టెస్ట్ మాత్రం కెప్టెన్‌గా రోహిత్ శర్మను మరో మెట్టు ఎక్కించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్ టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు చెపట్టినప్పుటి నుంచి టెస్ట్ క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతాం అంటూ.. బజ్‌బాల్ స్ట్రాటజీతో ఆటలో వేగం పెంచారు. గెలుపుకోసం టెస్టుల్లో కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామంటూ.. మంచి ఫలితాలు రాబట్టింది. భారత పర్యటన కంటే ముందు.. ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీ అద్భుతంగా సాగింది. ఈ టెస్ట్ సిరీస్‌లో కూడా తొలి మ్యాచ్‌లో గెలిచి.. ఇండియాపై కూడా బజ్‌బాల్ ప్రయోగిస్తామంటూ గొప్పలు చెప్పుకుంది. కానీ, తీరా చూస్తే.. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలైంది. అయితే.. ఈ మూడో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ జట్టుకు వ్యతిరేకంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా బజ్‌బాల్ ఎరా మొదలైన తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడుతూ.. మరే జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేకపోయింది. కానీ, తొలి సారి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్ అహంపై కొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ చేసింది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్ ముందు 557 టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో.. ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. సర్ఫరాజ్ ఖాన్ సైతం మరో ఫిఫ్టీతో అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో పాటు, ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు వ్యతిరేకంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలువడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma is the first & only captain to declare the innings against Bazball!🔥 pic.twitter.com/cIglUK2tbH
— CricketGully (@thecricketgully) February 18, 2024