iDreamPost

వరల్డ్‌ కప్‌ మనదేగా? అనే ప్రశ్నకు రోహిత్‌ సమాధానం చూడండి! గూస్‌బమ్స్‌ అంతే..

  • Published Nov 03, 2023 | 5:28 PMUpdated Nov 03, 2023 | 5:28 PM

ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌ను చూస్తే.. వరల్డ్‌ కప్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ప్రశ్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మకు ఎదురైతే.. ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి.

ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌ను చూస్తే.. వరల్డ్‌ కప్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ప్రశ్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మకు ఎదురైతే.. ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి.

  • Published Nov 03, 2023 | 5:28 PMUpdated Nov 03, 2023 | 5:28 PM
వరల్డ్‌ కప్‌ మనదేగా? అనే ప్రశ్నకు రోహిత్‌ సమాధానం చూడండి! గూస్‌బమ్స్‌ అంతే..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ సక్సెస్‌గా దూసుకెళ్తోంది. వరుసగా 7 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి.. సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ రెండో బాల్‌కే అవుటైనా.. శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి.. ఫామ్‌లోకి వచ్చేశాడు. దీంతో.. టీమిండియాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఎంతలా అంటే.. ఈ సారి కప్పు కొట్టకుండా టీమిండియాను ఏ శక్తి అడ్డుకోలేదనే ధీమాలోకి క్రికెట్‌ అభిమానులు వచ్చేశారు. ఇప్పటికే సెమీస్‌ చేరిన టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. టేబుల్‌ టాపర్‌గా టాప్‌ ఫోర్‌ టీమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో తొలి సెమీ ఫైనల్‌ ఆడుతోంది. రెండు లీగ్‌ మ్యాచ్‌లను పక్కనపెడితే.. సెమీస్‌, ఫైనల్‌ రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు చూపించిన ఆటలో 80 శాతం ఆడినా కప్పు టీమిండియాదే అని చాలా మంది క్రికెట్‌ నిపుణులు సైతం ఫిక్స్‌ అయిపోయారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్‌ అభిమానులు అడిగే ప్రశ్న ఒక్కటే.. ‘వరల్డ్ కప్‌ మనదేగా?’ అని. తాజాగా మరోసారి రోహిత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.

శ్రీలంకతో మ్యాచ్‌ తర్వాత.. ఈ నెల 5న ఈడెన్‌ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ కోసం జట్టు కోల్‌కత్తాకు పయనమైంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని రోహిత్‌ శర్మను ఇక వరల్డ్‌ కప్‌ మనదేగా అని అడగగా.. దానికి ఇంకొంచెం టైమ్‌ ఉందని రోహిత్‌ బదులిచ్చాడు. రోహిత్‌ అలా అన్నాడంటూ.. ఇక కప్పు మనదే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ మరింత స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారు. లీగ్‌ మ్యాచ్‌లు వదిలేస్తే.. ఇంకో రెండు విజయాలు సాధిస్తే.. వరల్డ్‌ కప్‌ టీమిండియాదే. ముచ్చటగా మూడో సారి భారత జట్టు క్రికెట్‌లో విశ్వవిజేతగా అవతరిస్తోంది. మరి ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌తో పాటు క్రికెట్‌ అభిమానికి రోహిత్‌ శర్మ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి