SNP
Rohit Sharma, Virat Kohli: ఐపీఎల్ మానియాతో క్రికెట్ లోకం ఊగిపోతుంటే.. మరోవైపు అప్పుడే టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ మొదలైపోయింది. వాటికి గురించి వస్తున్న వార్తలపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Virat Kohli: ఐపీఎల్ మానియాతో క్రికెట్ లోకం ఊగిపోతుంటే.. మరోవైపు అప్పుడే టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ మొదలైపోయింది. వాటికి గురించి వస్తున్న వార్తలపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఒకవైపు ఐపీఎల్ జోరుగా సాగుతుంటే.. మరోవైపు రాబోయే టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడనే ప్రచారం రెండు రోజులుగా జోరుగా సాగింది. ఈ వార్తపై క్రికెట్ అభిమానులంతా ఫుల్ ఖుష్ అయ్యారు. రోహిత్-కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ మొదలుపెడితే.. ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టాల్సిందేనని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మత సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే.. వారి ఆనందాన్ని ఆవిరి చేసేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. కానీ, రోహిత్, భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులు ముంబైలో సమావేశం అయ్యారని, టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్టు ఎంపికపై చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తారని, హార్ధిక్ పాండ్యా సరిగా బౌలింగ్ చేయకుంటే అతన్ని పక్కనపెడతారని, అలాగే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న యువ క్రికెటర్ రియాన్ పరాగ్‌ను టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకుంటారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాలపై రోహిత్ మాట్లాడుతూ.. తాను గానీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లేదా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులు ఎవరో ఒకరు ముందుకొచ్చి మాట్లాడితే కానీ, ఏ విషయం నమ్మకండి అంటూ స్పష్టత ఇచ్చాడు.
రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలతో టీ20 వరల్డ్ కప్ టీమ్‌పై అసలు చీఫ్ సెలెక్టర్‌తో ఎలాంటి చర్చలు జరగలేదని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం, పాండ్యాను పక్కనపెట్టడం, రియాన్ పరాగ్‌ను టీమ్‌లోకి తీసుకోవడం అంతా నిజం కాదని రోహిత్ శర్మ ఒక్క మాటతో తేల్చేశాడు. అలాగే ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్న దినేష్ కార్తీన్‌ను టీ20 వరల్డ్ కప్ కోసం ఒప్పించడం చాలా సులువని, కానీ, ధోనిని ఒప్పించడం కష్టమని అన్నాడు. ఇది సరదాగా చేసిన కామెంట్ అయినా.. డీకేను టీ20 వరల్డ్ కప్‌కు కన్సిడర్ చేయడం లేదనే విషయాన్ని మాత్రం రోహిత్ చెప్పకనే చెప్పాడు. ధోనితో పోలుస్తూ.. డీకేకు వయసు అయిపోయిందని చెప్పాడు. మరి టీ20 వరల్డ్ కప్ గురించి వస్తున్న వార్తలపై రోహిత్ ఇచ్చిన స్పష్టతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Q: Which Indian gonna get a boarding pass to the Caribbean for T20 Wc ?
Rohit Sharma: It’ll be hard to convince MSD for sure to come to West Indies I guess 😭😭 pic.twitter.com/0Vaw7Ecl7M
— 🐐 (@ItsHitmanERA) April 18, 2024
Rohit Sharma said – “I think today’s day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake”. (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek
— CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024