iDreamPost

Rohit Sharma: ఒకే ఇన్నింగ్స్ తో భారీ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్బుతమైన శతకం సాధించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ ఇన్నింగ్స్ తో రెండు భారీ రికార్డులను బద్దలుకొట్టాడు హిట్ మ్యాన్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్బుతమైన శతకం సాధించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ ఇన్నింగ్స్ తో రెండు భారీ రికార్డులను బద్దలుకొట్టాడు హిట్ మ్యాన్.

Rohit Sharma: ఒకే ఇన్నింగ్స్ తో భారీ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!

రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో కూడా భారీ స్కోర్లు సాధించలేక తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఆ విమర్శలన్నింటికీ.. మూడో టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో బదులిచ్చాడు హిట్ మ్యాన్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 భారీ సిక్స్ లతో శతకం సాధించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా రెండు భారీ రికార్డులను బ్రేక్ చేశాడు టీమిండియా సారథి. అందులో ఒకటి టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీది కాగా.. మరోటి మహేంద్రసింగ్ ధోనిది. మరి హిట్ మ్యాన్ బద్దలు కొట్టిన ఆ రికార్డులు ఏంటో తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలకమైన మూడో టెస్ట్ లో అద్భుత శతకంతో చెలరేగాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కొన్ని రోజులుగా పూర్ ఫామ్ లో ఉంటూ.. విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్, సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాకిచ్చాడు మార్క్ వుడ్. గత మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన హీరో యశస్వీ జైస్వాల్ ను 10 పరుగులకే పెవిలియన్ కు చేర్చాడు. ఆ వెంటనే శుబ్ మన్ గిల్ ను సైతం మార్క్ వుడ్ డకౌట్ గా బలికొన్నాడు. మంచి ఛాన్స్ దక్కించుకున్న రజత్ పాటిదార్ 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. బాధ్యతాయుత బ్యాటింగ్ తో జట్టును ముందుండి నడిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ(106*), రవీంద్ర జడేజా(69) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో రెండు భారీ రికార్డులను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. అందులో ఒకటి టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీది కాగా.. మరోటి మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా నాలుగో ప్లేస్ లో నిలిచాడు రోహిత్. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ 18,575 పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ లిస్ట్ లో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 26, 733 రన్స్ తో విరాట్ కోహ్లీ రెండో ప్లేస్ లో ఉండగా.. రాహుల్ ద్రావిడ్ 24, 208 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటుగా ధోని రికార్డును కూడా బ్రేక్ చేశాడు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్సులు కొట్టిన ఇండియన్ బ్యాటర్ గా రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు హిట్ మ్యాన్.

ధోని 90 టెస్టుల్లో 78 సిక్సులు కొట్టగా.. తాజాగా జరిగిన మ్యాచ్ లో రెండు సిక్స్ లు కొట్టడం ద్వారా ధోని రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. కేవలం 57 టెస్టుల్లోనే 79 సిక్సులు కొట్టి ముందుకు సాగుతున్నాడు హిట్ మ్యాన్. ఇక ఈ లిస్ట్ లో డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్సులు బాది ఇండియన్ బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరి ఒకే మ్యాచ్ లో రెండు అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: మూడో టెస్ట్‌లో రోహిత్‌ సెంచరీ! ఈ ఇన్నింగ్స్‌ చాలా స్పెషల్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి