iDreamPost

Rohit Sharma: ఫామ్ లో లేకపోయినా కోహ్లీని దాటేసిన రోహిత్.. నెం.1 బ్యాటర్ గా..

టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్నా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీని వెనక్కి నెట్టాడు.

టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్నా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీని వెనక్కి నెట్టాడు.

Rohit Sharma: ఫామ్ లో లేకపోయినా కోహ్లీని దాటేసిన రోహిత్.. నెం.1 బ్యాటర్ గా..

టీమిండియా సారథి రోహిత్ శర్మ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ ల సిరీస్ లో దారుణంగా విఫలమైన హిట్ మ్యాన్.. అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో కూడా నిరాశపరిచాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వరుసగా విఫలం అవుతున్నా రోహిత్ శర్మ మాత్రం టీమిండియా టాప్ బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీని వెనక్కి నెట్టాడు.

టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ.. ఓ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో కింగ్ కోహ్లీ ఉండేవాడు. అతడు 36 టెస్టుల్లో 39 సగటుతో 2235 పరుగులు చేశాడు. ఇక రోహిత్ కేవలం 29 మ్యాచ్ ల్లోనే 48 యావరేజ్ తో 2242 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కాగా.. ఈ జాబితాలో సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా 1769, రహానే 1589 ఉండగా.. యాక్సిడెంట్ కారణంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరమైన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 1575 పరుగులతో ఐదో స్థానంలో ఉండటం విశేషం. ఓవరాల్ గా టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఉన్నాడు. అతడు 4039 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. కోహ్లీ తొలి రెండు టెస్ట్ లకు అందుబాటులో లేకపోవడంతో రోహిత్ దూసుకొచ్చాడు. అయితే మరో రెండు మ్యాచ్ లకు సైతం కోహ్లీ దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో.. హిట్ మ్యాన్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కోహ్లీని దాటేసి నెం.1 ఇండియాన్ బ్యాటర్ గా నిలిచిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Henry Hunt: ఊహించని ఘటన! రక్తం కక్కుకుంటూ కుప్పకూలిన క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి