ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అనగానే సగటు క్రికెట్ అభిమానికి సైతం ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. అలాంటి మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. వారి ఆత్రుత తెరదించుతూ.. ఆసియా కప్ 2023లో ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో పాక్ బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కేవలం 66 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా సారధి రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి రోహిత్ శర్మ కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కెప్టెన్ రోహిత్ శర్మ.. ధోని తర్వాత టీమిండియాను ముందుండి నడిపిస్తున్న నాయకుడు. అయితే టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించినప్పటికీ మెగా టైటిల్స్ ను మాత్రం అందించలేకపోయాడు. ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ గ్రౌండ్ లో ప్రశాంతంగానే కనిపించినా.. అప్పుడప్పుడు గ్రౌండ్ లో సహనం కోల్పోతూ ఉంటాడు. అలా మైదానంలో ఇతర ఆటగళ్లపై నోరు పారేసుకున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూశాం. తాజాగా ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా రోహిత్ కెమెరామెన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో వర్షం వచ్చి కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మైదానాన్ని వీడారు ఆటగాళ్లు.
కాగా.. వర్షం తగ్గడంతో.. మళ్లీ బ్యాటింగ్ కు సిద్ధం అవుతున్నాడు రోహిత్. ఈ టైమ్ లో కెమెరామెన్ పదే పదే రోహిత్ శర్మను కెమెరాలో బంధిస్తున్నాడు. ఇది గమనించిన రోహిత్.. కెమెరాను కిందకి దించు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ పేస్ ధాటికి కేవలం 64 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్ లో ఇషాన్ కిషన్(48), పాండ్యా (31) ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతం 26 ఓవర్లకు టీమిండియా 4 వికెట్లకు 134 పరుగులు చేసింది.
Rohit Sharma is asking camera man to stop filming him. 😂🫣
Credit – (Hotstar)#INDvsPAK #RohitSharma pic.twitter.com/tCTqi71NDZ
— 12th Khiladi (@12th_khiladi) September 2, 2023