iDreamPost
android-app
ios-app

నవ్వుతూ రోహిత్ లీకులు! ముంబై కెప్టెన్‌గా రీ ఎంట్రీ పక్కానా?

  • Published Apr 04, 2024 | 5:21 PM Updated Updated Apr 05, 2024 | 5:41 PM

Rohit Sharma, Mumbai Indians, IPL 2024: ఐపీఎల్‌ 2024లో కెప్టెన్సీ కోల్పోయి ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ.. తిరిగి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Mumbai Indians, IPL 2024: ఐపీఎల్‌ 2024లో కెప్టెన్సీ కోల్పోయి ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ.. తిరిగి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 04, 2024 | 5:21 PMUpdated Apr 05, 2024 | 5:41 PM
నవ్వుతూ రోహిత్ లీకులు! ముంబై కెప్టెన్‌గా రీ ఎంట్రీ పక్కానా?

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పరిస్థితి అస్సలేం బాగాలేదు. టీమ్‌లో పరిస్థితులు కానీ, అభిమానుల నుంచి సపోర్ట్‌ విషయంలో కానీ, అలాగే జట్టు ప్రదర్శన విషయంలో కానీ.. ఏ విధంగా చూసుకున్న ముంబై ఇండియన్స్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ జట్టేనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది? అనిపించేలా మారిపోయింది. గత మూడు సీజన్ల నుంచి ఆ జట్టు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఇంత దారుణంగా మాత్రం కనిపించలేదు. దీనంతటికి కారణం రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించి అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడమే. అందుకే తప్పు తెలుసుకున్న ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌.. రోహిత్‌ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ క్రమంలోనే స్వయంగా రోహిత్‌ శర్మనే ఈ విషయంపై ఇచ్చే లీకులు.. అతను మళ్లీ కె​ప్టెన్‌ కాబోతున్నాడా? అనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ ఆదివారం అంటే 7వ తేదీనా ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందే ముంబై ఇండియన్స్‌ పగ్గాలను రోహిత్‌ శర్మ అందుకుంటాడని తెలుస్తోంది. దీనికి కారణంగా రోహిత్‌ శర్మ ఇచ్చిన సిగ్నల్‌ కూడా.. అదేంటంటే.. తాజాగా టీమ్‌తో కలిసి బస్సులో వెళ్తున్న రోహిత్‌ శర్మ అభిమానులకు చేతితో ఆరు వేళ్లు చూపించాడు. ఇప్పటికే ఐదు టైటిల్స్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ను మరోసారి ఛాంపియన్‌గా నిలపాలని అభిమానులు రోహిత్‌ను కోరారు.

దీంతో రోహిత్‌ శర్మ చేతితో ఆరు వేళ్లు చూపిస్తూ.. ఈ సారి కూడా కప్పు మనదే అని, ఆరో సారి టైటిల్‌ సాధిస్తామంటూ చెప్పకనే చెప్పాడు. అయితే.. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి ఉంది. అయినా కూడా రోహిత్‌ శర్మలో ఈ లెవల్‌ ఆఫ్‌ కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే.. అతను కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి, ముంబైని మళ్లీ ట్రాక్‌ ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించి, తన స్థానంలో పాండ్యాను కెప్టెన్‌ చేయడంపై రోహిత్‌ శర్మ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని కూడా రోహిత్ నిర్ణయంచుకున్నాడు. కానీ, ఏమైదో తెలియదు కానీ, మళ్లీ ఐపీఎల్‌ బరిలోకి దిగాడు. కానీ, టీమ్‌ పరిస్థితి బాగా లేకపోవడంతో మళ్లీ రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అంబానీ ఫ్యామిలీ భావిస్తోందని టాక్‌. అదే జరిగితే రోహిత్‌ కెప్టెన్‌గా మారి ముంబైని గెలిపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ ఇంత హ్యాపీగా ఆరో కప్పు కొడుతున్నాం అని చెప్పడంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş