iDreamPost
android-app
ios-app

IPLలో ఆ రూల్ తీసేస్తే.. ఈ ప్లేయర్లకు 100 కోట్లు ఖాయం: రాబిన్ ఊతప్ప

  • Published Mar 14, 2024 | 8:34 AM Updated Updated Mar 14, 2024 | 8:41 AM

ఐపీఎల్ లో ఆ రూల్ తీసేస్తే ఆ ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్లకు అమ్ముడవుతారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప. మరి ఆ రూల్ ఏంటి? ఆ ప్లేయర్లు ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ లో ఆ రూల్ తీసేస్తే ఆ ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్లకు అమ్ముడవుతారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప. మరి ఆ రూల్ ఏంటి? ఆ ప్లేయర్లు ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

IPLలో ఆ రూల్ తీసేస్తే.. ఈ ప్లేయర్లకు 100 కోట్లు ఖాయం: రాబిన్ ఊతప్ప

ఐపీఎల్ 2024 సీజన్ ఫ్రారంభానికి ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మార్చి 22న స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఇక ఇప్పటికే ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ శిబిరాల్లోకి చేరి, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. కాగా.. ఈ సీజన్ కు సంబంధించి గతేడాది జరిగిన మినీ వేలంలో ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో ఆ రూల్ తీసేస్తే.. ఆ ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్లకు అమ్ముడుపోతారని చెప్పుకొచ్చాడు. మరి ఆ రూల్ ఏంటి? ఆ ఆటగాళ్లు ఎవరు?

ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి గతేడాది జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది కోల్ కత్తా నైట్ రైడర్స్. పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుక్కుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్లు 20 కోట్ల కంటే ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ క్రమంలోనే క్యాష్ రిచ్ లీగ్ లో భారీ వేతనాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప.

robin uthappa interview

IPL వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలకు పరిమితి అనేది ఉంటుంది. ఈ లిమిట్ లేకపోతే ఈ టీమిండియా ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్ల కంటే ఎక్కవ ధరే పలుకుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క ఫ్రాంచైజీ వేలంలో 100 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి వీలుంది. ఇదే విషయాన్ని రాబిన్ ఊతప్ప ప్రస్తావిస్తూ..”ఐపీఎల్ లో ఒకవేళ ఓపెన్ వేలం ఉండి.. ఫ్రాంచైజీలు ఖర్చు పెట్టడానికి పరిమితి లేనట్లైతే, ఈ టీమిండియా ప్లేయర్లు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతారు. ఫ్రాంచైజీలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల లిమిట్ ఉంటే ఇది జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు జస్ప్రీత్ బుమ్రాది కాగా.. తర్వాత విరాట్, రోహిత్, పాండ్యా, సూర్యకుమార్, జైస్వాల్, గిల్ 100 కోట్ల ధర దక్కించుకుంటారు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఊతప్ప.

అలాగే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలు రూ. 80 నుంచి 100 కోట్ల మధ్యన అమ్ముడవుతారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఊతప్ప చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ లో ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ లీగ్ లో ఇతడికి మంచి అనుభవం ఉంది. వివిధ ఫ్రాంచైజీల తరఫున 205 మ్యాచ్ లు ఆడి 4,952 పరుగులు చేశాడు. మరి ఊతప్ప చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కొత్త చిక్కులు.. ఈ సమస్యను బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందో..?