iDreamPost
android-app
ios-app

ఐరన్ మ్యాన్‌ యాక్టర్ కు ఆస్కార్ అవార్డ్

  • Published Mar 11, 2024 | 9:37 AM Updated Updated Mar 11, 2024 | 9:37 AM

ఓపెన్‌హైమర్ లో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా విడుదలయినప్పటి నుంచే ఆయన నటనకి అంతటా ప్రశంసలే లభించాయి. అందరి అంచనాలకు తగ్గట్టే ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు రాబర్ట్ డౌనీ జూనియర్.

ఓపెన్‌హైమర్ లో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా విడుదలయినప్పటి నుంచే ఆయన నటనకి అంతటా ప్రశంసలే లభించాయి. అందరి అంచనాలకు తగ్గట్టే ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు రాబర్ట్ డౌనీ జూనియర్.

  • Published Mar 11, 2024 | 9:37 AMUpdated Mar 11, 2024 | 9:37 AM
ఐరన్ మ్యాన్‌ యాక్టర్ కు ఆస్కార్ అవార్డ్

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డు వేడుక‌లు అమెరికాలో భారీ ఎత్తున జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ముందు నుంచే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దానికి కారణం ఈసారి హాలీవుడ్ నుంచి చాలా భారీ సినిమాలు/నటులు నామినేషన్లలో ఉండటమే. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన క్లాసిక్ బయోపిక్ ఓపెన్‌హైమర్ సినిమాకు ఏయే అవార్డులు వస్తాయోనని హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తు వచ్చారు.

ఓపెన్‌హైమర్ లో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా విడుదలయినప్పటి నుంచే ఆయన నటనకి అంతటా ప్రశంసలే లభించాయి. తన నటనకు ఆస్కార్ ఖచ్చితంగా వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలకు తగ్గట్టే ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు రాబర్ట్ డౌనీ జూనియర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఈ హాలీవుడ్ యాక్టర్ కు దక్కిన తొలి అవార్డు కావడమే.

Oscar Award for Iron Man Actor 1

ఇతర భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సూపర్ హీరో సీరీస్ ఐరన్ మ్యాన్‌ లో టోనీ స్టార్క్‌ గా ఫేవరేట్ స్టార్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ కు భీభత్సమైన స్టార్డం ఉంది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన ఎవెంజర్స్ సిరీస్‌లో ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్లలో ఐరన్ మ్యాన్‌ మ్యాన్ క్యారెక్టరే ప్రేక్షకులకి ఎక్కువగా ఇష్టం. అయితే, ఇంత సుదీర్ఘ కెరీర్‌లో, రాబర్ట్ డౌనీ ఇంతవరకూ మూడుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయినా మొట్ట మొదటిసారి అకాడమీ అవార్డును ఓపెన్‌హైమర్ సినిమా ద్వారా గెలుచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరన్ మ్యాన్ పాత్రను తిరిగి మార్వెల్ సీరీస్ లో ప్రవేశపెడతారని కూడా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి రాబర్ట్ డౌనీ జూనియర్ కి ఆస్కార్ అవార్డు దక్కడం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.