iDreamPost

రాముడి శోభాయాత్రలో రెచ్చిపోయిన దొంగలు.. 8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు!

  • Published Apr 19, 2024 | 11:33 AMUpdated Apr 19, 2024 | 12:19 PM

Shree Ram Shobha Yatra: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు. ఇందు కోసం కొంతమంది కేటుగాళ్లు రక రకాల దందాలు చేస్తున్నారు.

Shree Ram Shobha Yatra: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు. ఇందు కోసం కొంతమంది కేటుగాళ్లు రక రకాల దందాలు చేస్తున్నారు.

  • Published Apr 19, 2024 | 11:33 AMUpdated Apr 19, 2024 | 12:19 PM
రాముడి శోభాయాత్రలో రెచ్చిపోయిన దొంగలు.. 8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు!

ఈజీ మనీ కోసం ఈ మధ్య చాలా మంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేస్తు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, అక్రమాయుధాల స్మగ్లింగ్, బెదిరింపులు ఇలా ఎన్నో దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ మధ్య కొంతమంది దొంగలకు కనీస పాపభీతి లేకుండా పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఘనంగా శోభాయాత్ర జరిగిన విషయం తెలిసిందే. అందరూ భక్తితో శ్రీరాముడి శోభాయాత్రలో పాల్గొంటే.. కొంతమంది దొంగలు చేతివాటం చూపించారు. ఈ క్రమంలోనే పలు స్టేషన్లలో 50 మంది వరకు తమ సొత్తు దొంగిలించారని ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో శ్రీరామ నవమి రోజును స్వామి వారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఎండను సైతం లెక్కక చేయకుండా భక్తులంతా ఎంతో ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కొంతమంది భక్తులు రోడ్లపై పానకాలు పంచారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఇక శోభాయాత్ర సందర్భంగా శ్రీరామ స్మరణ చేసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతే.. దొంగలు రెచ్చిపోయారు. అందినంత దోచుకుపోయారు. శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా శ్రీరాముడి దర్శనకం కోసం రోడ్డుకు ఇరువైపుల భక్తులు నిలబడ్డారు. ఈ సందర్భంగా పక్కా స్కెచ్ వేసి కొంతమంది దొంగలు చైన్లు, బ్రేస్ లెట్, మొబైల్స్ చోరీ చేశారు. తమ వస్తువులు పోగొట్టుకున్న బాధితులు లబో దిబో అంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టారు.

రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది దొంగలు భక్తులను టార్గెట్ చేసుకొని సెలెంట్ గా భక్తుల్లాగా బిల్డప్ ఇస్తూ తమ పని తాము చేసుకుని వెళ్లారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ.. దొంగలు కొట్టేసిన వస్తువులను క్షణాల్లో ముఠా సభ్యులే చేతులు మార్చుకొని అక్కడ నుంచి మాయం అయ్యారని అన్నారు. కొంతమంది దొంగలను భక్తులు సమయస్ఫూర్తి ప్రదర్శించి పట్టి ఇచ్చారని అన్నారు. వారి ద్వారా మిగతా దొంగల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీతారామ్ బాగ్ టెంపుల్ , మంగళ్ హాట్ నుంచి హనుమాన్ వ్యాయమశాల, సుల్తాన్ బజార్ వరకు రాములోరి శోభాయాత్ర జరుగుతుంది. తమ వస్తువులు దొంగిలించారని మంగళ్ మాట్, షాహినాయత్ గంజ్, అఫ్జల్ గంజ్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 50 మంది ఫిర్యాదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి