iDreamPost
android-app
ios-app

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి!

  • Published Jul 22, 2023 | 9:52 PM Updated Updated Jul 22, 2023 | 9:52 PM
  • Published Jul 22, 2023 | 9:52 PMUpdated Jul 22, 2023 | 9:52 PM
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి!

ఏపీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులుఎ గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట సమీపంలో ఉన్న మలుపు వద్ద శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కడప నుంచి తిరుపతికి ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తుంది. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

ఆ తర్వాత పోలీసులకు కూడా సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, మృతులు.. రాజంపేట మండలం వెంకట రాజంపేటకు చెందిన శేఖర్ (45), ఓబులవారిపల్లెకు చెందిన గుండాల శ్రీనివాస్, కడపకు చెందిన బాషా (65) ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి మరణవార్త తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: విషాదం: లిఫ్ట్ గుంతలో పడి 10వ తరగతి బాలిక మృతి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet