iDreamPost

ఏరాసు, బుడ్డా.. శ్రీశైలం టీడీపీ కథ …

ఏరాసు, బుడ్డా..  శ్రీశైలం టీడీపీ కథ …

శ్రీశైలం లో శివరాత్రి కన్నా ముందే సందడి మొదలైంది… ఇది రాజకీయ సందడి… వైసీపీ తరుపున గెలిచిన టీడీపీలో చేరిన ఒక నాయకుడు ఇప్పుడు జగన్ పంచన చేరే అవసరం నాకేముంది అని ఎవరు అడగక ముందే మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు…

అదే  నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు , మాజీ మంత్రి.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప‌రిస్థితేమీ బాగోలేదు. రాజ‌కీయాల్లో ఆయ‌న జీవితం అస్తమిస్తున్న సూర్యుడిలాగే అనిపిస్తోంది.ఆ నేత ఇప్పుడేం చేయ‌బోతున్నారు?

ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి.. ఏరాసు అయ్య‌పు రెడ్డి కుమారుడిగానే కాకుండా రాజ‌కీయాల్లో మాజీ మంత్రిగా ఆయ‌న‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాయ‌ల‌సీమ‌లో పేరొందిన రాజ‌కీయ కుటుంబాల్లో ఏరాసు కుటుంబం ఒక‌ట‌ని చెప్పొచ్చు. ఏరాసు అయ్య‌పు రెడ్డి హై కోర్టు లాయర్ గా ఎమ్మెల్యేగా, ఎంపీగా క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజ‌కీయాల్లో పేరు సంపాదించారు. నంద్యాల నుంచి పీవీ నరసింహ రావ్ పోటీ చేయటానికి మూలకారకుల్లో అయ్యపురెడ్డి ఒకరు. ఆయ‌న త‌రువాత ఏరాసు ప్ర‌తాప రెడ్డి రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి విభ‌జ‌న అనంత‌రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

Read Also: జగన్.. చంద్రబాబు.. జయలలిత విషయంలో ఎవరు చెప్పింది నిజం..?

1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్మకూరు(2009 నుంచి శ్రీశైలం గా మారింది) నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయ‌న‌.. 2004, 2009 ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న న్యాయ‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి చివరి నిమిషంలో పాణ్యం టికెట్ సాధించి మూడో స్థానంలో నిలిచాడు. అయితే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న పార్టీలోనే కొన‌సాగారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఆశించినా ద‌క్క‌క‌పోవ‌డంతో పోటీ చేయ‌లేదు. ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ జీవితం అయోమ‌యంలో ప‌డింది.

టిడిపి అధికారంలో ఉంద‌ని.. 2019 త‌ర్వాత కూడా టిడిపినే అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అప్పుడు మంచి స్థానం ల‌భిస్తుంద‌న్న ఆశ‌లో భంగ‌ప‌డిన వారిలో ఏరాసు కూడా ఒక‌రు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు చూపించిన మాయ‌లో ప‌డి త‌న రాజకీయ జీవితం ఎటూ కాకుండా చేసుకున్నార‌ని ఆయ‌న వ‌ర్గీయులు ఆవేద‌న చెందుతుంన్నారు.

Read Also: పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్‌

అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఏరాసు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన శ్రీ‌శైలానికి తిరిగి ప‌య‌న‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డైతే ఆయ‌న సొంత వ‌ర్గం ఉంది కాబ‌ట్టి మ‌ళ్లీ బ‌ల‌ప‌డేందుకు ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు సాగుతున్న‌ట్లు అనిపిస్తోంది. శ్రీ‌శైలం, ఆత్మ‌కూరు, వెలుగోడు, బండి ఆత్మ‌కూరు, మ‌హానంది మండ‌లాల్లో అప్ప‌ట్లో ఏరాసుకు క్యాడ‌ర్ బాగానే ఉండేది. అయితే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలిపెట్టి పాణ్యంకి మారిపోవ‌డంతో ఈ ఐదేళ్ల కాలంలో శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న క్యాడ‌ర్ దెబ్బ‌తినింది.

ఇప్పుడు శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గం బుడ్డా, శిల్పా కుటుంబాల చేతిలో ఉంది. 2014లోవై.ఎస్‌.ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజ‌యం సాధించి ఆ త‌రువాత అధికార పార్టీ అయిన టిడిపిలోకి వెళ్లిపోయారు. 2019లో వైసీపీ త‌రుపున శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు శ్రీ‌శైలం టిడిపి ఇంచార్జిగా బుడ్డానే ఉన్నారు.

Read Also: జీవీఎల్ కు చెక్ పెడుతున్నారా?

మొన్న‌టి ఎన్నిక‌ల్లోనే పోటీ చేసేందుకు త‌డ‌బ‌డిన బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఓట‌మి త‌ర్వాత టీడీపీతో అంటీ అంట‌నట్లుగా ఉన్నారు. రెండు రోజుల కిందట విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడిన బుడ్డా.. శాశ్వ‌తంగా టిడిపిలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్ తోనే అని అదను చూసి అధికారం కోసం టీడీపీలోకి ఫిరాయించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెప్పే “శాశ్వత” మాటలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఏరాసు ప్రతాప్ రెడ్డి రాకను నిలువరించటానికే బుడ్డా ప్రెస్ మీట్ పెట్టారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయినా,ఏరాసు ప్రతాప్ రెడ్డి అయినా ఎవరు టీడీపీ ఇన్ చార్జులుగా వచ్చినా శ్రీశైలంలో వైసీపీ బలంగా ఉంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి 40వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే ఇక్క‌డ వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఏవిధంగా అభిమానం ఉందో తెలుస్తుంది. ఇక్కడ వైసీపీ బలానికి,శిల్ప చక్రపాణి రెడ్డి వ్యక్తిగత బలం అదనం. గత 10 సంవత్సరాలుగా శిల్పా చక్రపాణి రెడ్డి
పార్టీలకు అతీతంగా వర్గాన్ని తయారు చేసుకున్నాడు. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం, యువకులకు మోటార్ సైకిల్స్ కొనియ్యటం,నీటి సరఫరా.. ఇలా అనేక సేవా కార్యక్రమాల శిల్పా చక్రపాణి రెడ్డి ద్వారా ప్రజలకు దగ్గరయ్యాడు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి పాణ్యంను వ‌దిలి శ్రీ‌శైలంకు వ‌చ్చినా ప్ర‌భావం చూపటం కష్టమే ,అసాధ్యమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి