iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వస్తోన్న హర్రర్ మూవీ ‘వళరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 02, 2024 | 10:41 AM Updated Updated Mar 02, 2024 | 11:50 AM

Valari Movie will Streaming on ETV Win: ఇటీవల హర్రర్, క్రైమ్ థ్రిలర్ మూవీస్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఈ జోనర్ లో వస్తున్న మరో హర్రర్ మూవీ పళరి.

Valari Movie will Streaming on ETV Win: ఇటీవల హర్రర్, క్రైమ్ థ్రిలర్ మూవీస్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఈ జోనర్ లో వస్తున్న మరో హర్రర్ మూవీ పళరి.

  • Published Mar 02, 2024 | 10:41 AMUpdated Mar 02, 2024 | 11:50 AM
ఓటీటీలోకి వస్తోన్న హర్రర్ మూవీ ‘వళరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం ఓటీటీ జమానా నడుస్తుంది. ధియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా సమయంలో ధియేటర్లు మూసి వేయడంతో చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూడటం మొదలు పెట్టారు.. ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయింది. ఓటీటీలో భారతీయ చిత్రాలే కాకుండా ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ వస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రితికా సింగ్ నటించిన హర్రర్, థ్రిల్లర్ మూవీ ‘పళరి’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ అనే విషయం గురించి తెలుసుకుందాం..

సినీ ఇండస్ట్రీలోకి క్రీడా రంగం నుంచి చాలా మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిని రితికా సింగ్ ఒకరు. 2016లో ‘ఇరుదచుట్రు’మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన రితికా సింగ్ తాజాగా ‘వళరి’ అనే హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఎం మృతిక సంతోషిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్ హీరోగా నటిస్తున్నాడు. కే సత్యబాబు ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తి కలిగించాయి.

ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువగా హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ తో మూవీ మేకర్స్ కూడా ఈ తరహా చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల విరూపాక్ష నుంచి మొదలు.. మొన్నటి పొలిమేర 2, పిండం మూవీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం రిలీజ్ ‘వళరి’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగా ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంది. అది వెంకటాపురం బంగ్లా.. దెయ్యాల కొంప అనే డైలాగ్ తో వళరి ట్రైలర్ మొదలవుతుంది. ‘మనం ఒక పాపం చేసి ఆ తర్వాత ఆ పానాన్ని మర్చిపోతే ఇంకా మనం పాపాత్ములమేనా?’ అంటూ డైలాగ్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని పెంచాయి.  ఈ మూవీలో రితికా సింగ్  నటన అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ తెలుగు లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 6న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ రితికా సింగ్ కి మంచి పేరు తెస్తుందని అంటున్నారు.

marsbahis girişjojobetjojobet giriş