iDreamPost

మలింగాను కోహ్లీ ఉతికేస్తే.. జూనియర్‌ మలింగాపై పంత్ పంజా! సేమ్ సీన్ రిపీట్!

  • Published Apr 01, 2024 | 3:46 PMUpdated Apr 01, 2024 | 3:46 PM

Rishabh Pant, Matheesha Pathirana: చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సీన్‌.. ఓ 12 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, Matheesha Pathirana: చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సీన్‌.. ఓ 12 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 01, 2024 | 3:46 PMUpdated Apr 01, 2024 | 3:46 PM
మలింగాను కోహ్లీ ఉతికేస్తే.. జూనియర్‌ మలింగాపై పంత్ పంజా! సేమ్ సీన్ రిపీట్!

ఐపీఎల్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఓవర్‌కి రెండు బౌన్సర్లు వేసుకునే రూల్‌ తీసుకొచ్చినా.. బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారనే కానీ, ఓవరాల్‌గా మాత్రం బౌలర్లపై తమ డామినేషన్‌ను కొనసాగిస్తున్నారు. సాధారణంగా టీ20 క్రికెట్‌ అంటే బ్యాటర్ల ఆటగా చెప్పుకుంటారు. ఐపీఎల్‌లో కూడా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ ‍క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో తన తొలి హాఫ్‌ సెంచరీ బాదేశాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి తన టీమ్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఈ క్రమంలోనే జూనియర్‌ మలింగాగా పేరుతెచ్చుకున్న మతీష పతిరాణాను ఉతికి ఆరేశాడు పంత్‌.

అతను వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌, ఫోర్‌తో పాటు మొత్తం 16 పరుగులు రాబట్టాడు. అయితే.. చివరి ఓవర్లలో ఇలాంటి బ్యాటింగ్‌ సాధారణమే కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ, అంతకంటే ముందు ఓవర్లలో పతిరాణా ఢిల్లీ బ్యాటర్లను ఒక విధంగా వణికించాడు. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌తో పాటు సౌతాఫ్రికాకు చెందిన యువ క్రికెటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌లను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. యార్కర్లతో నిప్పులు చిమ్ముతున్న పతిరాణా.. 18వ ఓవర్‌లో పంత్‌కు కూడా అలాంటి బౌలింగే వేశాడు. కానీ, పంత్‌ తన సత్తా చూపిస్తూ.. పతిరాణాకు తన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాడు.

అయితే.. పంత్‌ పతిరాణాను కొడుతున్న సీన్‌ చూసి.. చాలా మంది క్రికెట్‌ అభిమానులకు ఓ సూపర్‌ మ్యాచ్‌ గుర్తుకు వచ్చింది. 2012 ఫిబ్రవరి 28న కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో అప్పటి ప్రపంచ మేటి బౌలర్‌, శ్రీలంక బౌలింగ్‌ గన్‌ లసిత్‌ మలింగాను కోహ్లీ చీల్చిచెండాడు. 86 బంతుల్లో 133 పరుగులు చేసి లంకపై తన విశ్వరూపం చూపించాడు. 321 టార్గెట్‌ను భారత్‌ 36.4 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఆ మ్యాచ్‌లో మలింగాను కోహ్లీ పిచ్చికొట్టుడు కొట్టాడు. కోహ్లీ బాదుడికి తట్టుకోలేక 7.4 ఓవర్లకే పరిమితం అయ్యాడు. 46 బంతుల్లో ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు అదే సీన్‌ను పంత్‌ రిపీట్‌ చేస్తూ మతీష పతిరాణాను ఉతికేశాడు. అప్పుడు కోహ్లీ సీనియర్‌ మలింగాను కొడితే.. ఇప్పుడు జూనియర్‌ మలింగాను పంత్‌ ఇరగదీశాడంటూ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి