iDreamPost

ఇంగ్లండ్ సిరీస్​తోనే రీఎంట్రీ ఇద్దామనుకున్నా.. కానీ వాళ్లే ఆపారు: పంత్

  • Published Mar 13, 2024 | 5:04 PMUpdated Mar 13, 2024 | 5:04 PM

టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాను ఈపాటికే కమ్​బ్యాక్ ఇవ్వాల్సిందని అన్నాడు పంత్.

టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాను ఈపాటికే కమ్​బ్యాక్ ఇవ్వాల్సిందని అన్నాడు పంత్.

  • Published Mar 13, 2024 | 5:04 PMUpdated Mar 13, 2024 | 5:04 PM
ఇంగ్లండ్ సిరీస్​తోనే రీఎంట్రీ ఇద్దామనుకున్నా.. కానీ వాళ్లే ఆపారు: పంత్

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ గ్రౌండ్​లోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 15 నెలల విరామం అనంతరం పొట్టి క్రికెట్​లోకి అడుగు పెడుతున్నాడు పంత్. 2022 డిసెంబర్​లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ డాషింగ్ క్రికెటర్.. ఇంజ్యురీ నుంచి కోలుకొని ఎట్టకేలకు మ్యాచ్ ఫిట్​నెస్ సాధించాడు. ఐపీఎల్-2024తో తిరిగి క్రికెట్​లో ఫీల్డ్​లో అడుగుపెట్టనున్నాడు పంత్. బ్యాటింగ్​తో పాటు వికెట్ కీపింగ్ చేసేందుకు అవసరమైన మ్యాచ్ ఫిట్​నెస్​ను అతడు సాధించాడని భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్​గా ముగిసిన ఇంగ్లండ్ సిరీస్​తోనే తాను రీఎంట్రీ ఇవ్వాల్సిందని అన్నాడు. అయితే వాళ్లు ఆపడంతో అది సాధ్యం కాలేదన్నాడు.

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ సమయానికి ఫిట్​నెస్​ సాధించాలని నేను అనుకున్నా. ఫిట్​గా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించా. అయితే ఆ సిరీస్​లో ఆడకుండా బీసీసీఐ, ఎన్​సీఏ ఆపాయి. నా విషయంలో ఒకేసారి బర్డన్ వేయకుండా వర్క్​లోడ్​ను క్రమంగా పెంచాలని అనుకున్నారు. భారత క్రికెట్ బోర్డుతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ నాకు చేసిన సాయాన్ని, కష్టకాలంలో అండగా నిలవడాన్ని అస్సలు మర్చిపోలేను. బోర్డు సెక్రటరీ జై షా నా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంగ్లండ్​తో సిరీస్​లో ఆడించడం తొందరపాటు చర్య అవుతుందని వాళ్లు భావించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి టెస్టుల్లో ఇంత త్వరగా ఆడించడం కరెక్ట్ కాదని అనుకున్నారు. రీఎంట్రీ తర్వాత క్రమంగా వర్క్​లోడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో వాళ్ల ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. నా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు వాళ్లకు థ్యాంక్యూ’ అని పంత్ చెప్పుకొచ్చాడు.

రోడ్డు ప్రమాదాన్ని కూడా మరోమారు గుర్తుచేసుకున్నాడు పంత్. ఆ యాక్సిడెంట్​ తర్వాత డాక్టర్లు తన కాలును తీసేస్తారని అనుకున్నానని తెలిపాడు. అయితే ప్రమాదానికి గురైనప్పుడు ఏదో శక్తి తనను కాపాడినట్లు అనిపించిందని, ఇంతకు మించిన ఘోర ప్రమాదాన్ని ఊహించలేనని పంత్ పేర్కొన్నాడు. కాలు తొలగించడం గురించి వైద్యులు తనతో మాట్లాడారని వ్యాఖ్యానించాడు. కాగా, యాక్సిడెంట్ కారణంగా గతేడాది ఐపీఎల్​కు దూరంగా ఉన్న పంత్ ఈసారి రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఐపీఎల్​లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. చిన్నారితో జెర్సీని పంపి టీమ్​లోకి ఆహ్వానించింది. ఆ టీ-షర్ట్​ను వేసుకొని వచ్చేస్తున్నాను అంటూ పోజులు ఇచ్చాడు పంత్. మరి.. పంత్ రీఎంట్రీ డిలే అవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి