iDreamPost

మారని పంత్ బ్యాడ్ లక్! హాఫ్‌ సెంచరీతో రాణించినా ఆనందం లేని ఘటన!

  • Published Apr 01, 2024 | 2:08 PMUpdated Apr 01, 2024 | 2:16 PM

Rishabh Pant, CSK vs DC, IPL 2024: ఐపీఎల్‌ 2024లో పంత్‌ తన తొలి హాఫ్‌ సెంచరీని సాధించాడు. పైగా సూపర్‌ వికెట్‌ కీపింగ్‌తో అదరగొట్టాడు. అయినా కూడా పంత్‌పై చర్యలు తీసుకున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, CSK vs DC, IPL 2024: ఐపీఎల్‌ 2024లో పంత్‌ తన తొలి హాఫ్‌ సెంచరీని సాధించాడు. పైగా సూపర్‌ వికెట్‌ కీపింగ్‌తో అదరగొట్టాడు. అయినా కూడా పంత్‌పై చర్యలు తీసుకున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 01, 2024 | 2:08 PMUpdated Apr 01, 2024 | 2:16 PM
మారని పంత్ బ్యాడ్ లక్! హాఫ్‌ సెంచరీతో రాణించినా ఆనందం లేని ఘటన!

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స​ విజయఢంకా మోగించింది. ఆదివారం విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజవేఖర్‌రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో సీఎస్‌కేకు ఈ సీజన్‌లో తొలి ఓటమి ఎదురుకాగా, డీసీకి తొలి విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని సూపర్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాడు. కానీ, ధోనిని మించి బ్యాటింగ్‌ చేశాడు రిషభ్‌ పంత్‌. సూపర్‌ హాఫ్‌ సెంచరీతో తన టీమ్‌కు భారీ స్కోర్‌ అందించాడు. అయినా కూడా పంత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన టీమ్‌ గెలిచినా.. తాను ఫిఫ్టీతో అదరగొట్టినా.. పంత్‌పై ఐపీఎల్‌ కమిటీ చర్యలు తీసుకుంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిన్నటి మ్యాచ్‌లో పంత్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి.. సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేసి అలరించాడు. అయితే.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పంత్‌కు రూ.12 లక్షల ఫైన్‌ పడింది. నిర్దేశించిన సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ ఓవర్లు పూర్తి చేయకుండా వెనుకబడిన కారణంగా ఆ టీమ్‌ కెప్టెన్‌ అయిన పంత్‌కు జరిమానా విధించారు. అయితే.. ఇది పంత్‌కు పెద్ద విషయం కాదు. ఇలాంటి ఫైన్లు చాలానే పడుతుంటాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించడం, తాను హాఫ్‌ సెంచరీతో పాటు, అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌తో ప్రమాదానికి ముందు రోజుల్ని గుర్తు చేయడంతో అంతా హ్యాపీగా ఉన్నారు.

bad luck for pant

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీకి సూపర్‌ స్టార్ట్‌ అందించారు. షా 43, వార్నర్‌ 52 పరుగులతో అదరగొట్టారు. వీరిచ్చిన స్టార్ట్‌కు వన్‌డౌన్‌లో వచ్చిన పంత్‌ మరింత స్కోర్‌ యాడ్‌ చేసి.. డీసీకి భారీ స్కోర్‌ అందించాడు. పంత్‌ 51 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. లేదంటే మరింత స్కోర్‌ వచ్చేది. సీఎస్‌కే బౌలర్‌ మతీష పతిరాణా 3 వికెట్లతో రాణించాడు. ఇక 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నైకి డీసీ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్రలను సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. అజింక్యా రహానె 45, డారిల్‌ మిచెల్‌ 34 రన్స్‌తో రాణించినా ఫలితం లేకపోయింది. చివర్లో ధోని 37 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అప్పటికే బాగా లేట్‌ అయిపోయింది. దీంతో సీఎస్‌కే 20 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో పంత్‌ ప్రదర్శనతో పాటు పంత్‌కు ఫైన్‌ పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి