SNP
తాజాగా ఓ వీడియో సెలెక్టర్ల గూబ గుయ్ మనిపించాడు. రింకూ పోస్టు చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ సైతం రింకూకు మద్దతు పలుకుతూ.. రింకూ తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజాగా ఓ వీడియో సెలెక్టర్ల గూబ గుయ్ మనిపించాడు. రింకూ పోస్టు చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ సైతం రింకూకు మద్దతు పలుకుతూ.. రింకూ తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.
SNP
టీమిండియాలో తనకు చోటు కల్పించకపోవడంపై రింకూ సింగ్‌లో ఇంకా కోపం తగ్గినట్లు లేదు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జట్టను ప్రకటించిన వెంటనే ఒక కోట్‌తో తన అసహనాన్ని వ్యక్తం చేసిన రింకూ భాయ్.. తాజాగా ఓ వీడియో సెలెక్టర్ల గూబ గుయ్ మనిపించాడు. రింకూ పోస్టు చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ సైతం రింకూకు మద్దతు పలుకుతూ.. రింకూ తగ్గేదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఆ వీడియోలో ఏముందంటే.. దేశవాళీ క్రికెట్ టోర్నీలో దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 69 బంతుల్లో 6 ఫోర్లతో 48 రన్స్ చేశాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 40 రన్స్ చేసి రాణించాడు. తనను వెస్టిండీస్ టూర్‌కు ఎంపిక చేయలేదనే బాధలో ఉన్నా కూడా ఇంత మంచి ప్రదర్శన ఇవ్వడంతో దాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడో ఏమో కానీ, ఆ మ్యాచ్ హైలెట్స్ వీడియోను రింకూ షేర్ చేశాడు.
అద్భుతమైన షాట్లతో రింకూ బ్యాటింగ్ చేస్తున్న ఆ వీడియో వైరల్‌గా మారింది. పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అనే తేడా లేకుండా.. రింకూ చెలరేగి ఆడాడు. భారీ షాట్లు, రివర్స్ స్విప్‌లతో అలరించాడు. దీంతో ఈ వీడియోను సెలెక్టర్ల కోసమే పెట్టాడంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కామెంట్ల చేస్తున్నారు. తనను ఎందుకు ఎంపిక చేయలేదో సెలెక్టర్లు సమాధానం చెప్పాలని సవాలు చేస్తున్నట్లు ఆ వీడియో ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో రింకూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ ఏడాది అయితే అతని బ్యాటింగ్ వండర్ అనే చెప్పాలి. ఓ మ్యాచ్‌లో అయితే ఏకంగా చివరి 5 బంతుల్లో 5 సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించి సంచలనం నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి తనలో ఓ అద్భుత ఫనిషర్ ఉన్నాడని, ఒత్తడిని తట్టుకుని నిలబడి మ్యాచ్ చివరి వరకు ఆడే ఓ గొప్ప మ్యాచ్ విన్నర్ ఉన్నాడని రింకూ నిరూపించాడు. ఆ 5 బంతుల్లో 5 సిక్సులు ఏదో గాలివాటంలా వచ్చినవి కాదని, సీజన్ మొత్తం రింకూ ఆడిన విధానం చూస్తే అర్థం అవుతుంది. ఇలాంటి టాలెంట్ ఉన్న ఆటగాడికి టీమిండియాలో అవకాశం ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రింకూను టీమిండియాకు ఎంపిక చేయకపోవడం, దానిపై రింకూ వీడియో షేర్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.