iDreamPost

జయం మూవీలో సదా చెల్లెలు.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

2002లో సినిమా థియేటర్లను ఊపేసిన సినిమా జయం. నితిన్, సదా హీరో హీరోయిన్లు. సినిమాకే కాదు.. పాటలకు కూడా యువత ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసినా, విన్నా ఇవే సాంగ్స్ మార్మోగిపోయాయి. ఇక ఈ మూవీలో సదా చెల్లెలిగా నటించిన చిన్నారి గుర్తుంది కదా..

2002లో సినిమా థియేటర్లను ఊపేసిన సినిమా జయం. నితిన్, సదా హీరో హీరోయిన్లు. సినిమాకే కాదు.. పాటలకు కూడా యువత ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసినా, విన్నా ఇవే సాంగ్స్ మార్మోగిపోయాయి. ఇక ఈ మూవీలో సదా చెల్లెలిగా నటించిన చిన్నారి గుర్తుంది కదా..

జయం మూవీలో సదా చెల్లెలు.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు తేజ. చిత్రం నుండి అహింసా చిత్రాల వరకు పరిశీలిస్తే.. ఆయన సినిమాల్లో ప్రేమ కథలే ఎక్కువ. ఇప్పుడంటే సరైన హిట్ లేక..వెనకబడ్డాడు కానీ.. ఒక్క హిట్ పడితే.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం. దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌ను లవర్ బాయ్‌గా మార్చేసిన దర్శకుడాయన. కొత్త వాళ్లతో సినిమాలు తెరకెక్కించి.. సక్సెస్ కొడుతుంటాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సదా, కాజల్ అగర్వాల్, ఎస్తేర్ ఆయన పరిచయం చేసిన అమ్మాయిలే. మహేష్ బాబు, గోపిచంద్, నితిన్, రానా, కళ్యాణ్ రామ్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఉదయ్‌తో పాటు నితిన్‌ను కూడా ఆయనే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు.

చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఫ్యామిలీ సర్కర్ అనే కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించాడు తేజ. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తనకు కలిసి వచ్చిన నిబ్బా, నిబ్బా లవ్ స్టోరీనే నమ్ముకున్నాడు. అలా నువ్వు నేను తీస్తే.. థియేటర్లు దద్దరిల్లాయి. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్‌కు స్టార్ డమ్ వస్తే.. తేజకు ఒక్కసారిగా పేరు వచ్చింది. ఇదే ఊపుతూ కొత్త వారితో 2002లో జయం అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే నితిన్, సదా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇది కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీనే. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి పడేశాడు. ఈ పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. యూత్ ఊగిపోయారు ఈ సాంగ్స్‌కు.

‘రాను రానంటూనే చిన్నదో’, ‘బండి బండి రైలు బండి’, ‘ఎవ్వరు ఏమన్నా’, వీరి వీరి గుమ్మడి పండు’, ‘ప్రియతమా తెలుసునా’, ‘అందమైన మనస్సులో ఇంత అలజడి ఎందుకో’ అలా అన్ని పాటలు కూడా చాలా ఫేమస్. ఇందులో కూడా ఓ పెద్దింటి అమ్మాయి.. ఓ పేదింటి అబ్బాయి ప్రేమలో పడి.. తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారన్నదే కథ. ఇందులో ఇప్పటి స్టార్ హీరో గోపిచంద్ విలన్. సుజాతగా సదాకు ఓ మ్యానరిజం ఉంటుంది. ‘వెళ్లవయ్యా వెళ్లు’ అంటూ. అలాగే సదాకు చెల్లెల్లిగా నటించిన పాప గుర్తుందా.. ఆమెకు కూడా ఇందులో స్పెషల్‌గా క్యారెక్టర్ డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇందులో అక్షరాలను రివర్స్‌లో రాస్తుంది ఈ చిన్నారి.

ఇంతకు ఆ పాప ఎవరో.. ఎక్కడ ఉందో తెలుసా..ఆ పాప పేరు యామిని శ్వేత . ఆమె ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురు. జయం మూవీకి ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. బాల నటిగా అనేక సీరియల్స్, సినిమాలు చేసింది. సీతామహాలక్ష్మి అనే సీరియల్ చేస్తున్న సమయంలో ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడప్పుడు, ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు అనే చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి.. విదేశాల్లో ఎంఎస్ చేసింది. ఆ తర్వాత హర్ష అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఓ పాప. ప్రస్తుతం సోషల్ మీడియాలో భర్త, పాప, తన ట్రావెల్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది శ్వేత.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి