iDreamPost

RBI కొత్త రూల్స్.. ఇకపై CIBIL స్కోర్ సమస్యలకు చెక్!

ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. దీంతో సిబిల్ స్కోర్ లో భారీ మార్పులు రానున్నాయి. అసలు ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. దీంతో సిబిల్ స్కోర్ లో భారీ మార్పులు రానున్నాయి. అసలు ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

RBI కొత్త రూల్స్.. ఇకపై CIBIL స్కోర్ సమస్యలకు చెక్!

మనం లోన్ల కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుంటాము. అయితే ఆ సంస్థలు లోన్ ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్ ను చూసి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం అందిస్తాయి. లేదంటే నిరాకరిస్తాయి. అయితే ఈ క్రెడిట్ స్కోర్ ను ఆ సంస్థలు ఎక్కడ చూస్తాయో తెలుసా. క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ ద్వారానే సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తాయి. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ లో సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ ఉంటాయి. వీటిని క్రెడిట్ బ్యూరోస్ అని కూడా అంటారు.

అదే మనం చెక్ చేసుకుంటే సాఫ్ట్ ఎంక్వైరీ అంటాము. మనం స్వతహాగా ఎన్ని సార్లు చెక్ చేసుకున్న స్కోర్ మాత్రం తగ్గదు. అయితే మనం లోన్ కోసం ఏదైన ఆర్థిక సంస్థ వద్ద అప్లై చేసుకున్నప్పుడు ఆ సంస్థ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆ సమాచారాన్ని చేరవేస్తోంది. దీంతో ఆ సంస్థలు సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తున్నాయి. దీంతో సిబిల్ స్కోర్ భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని గమనించిన ఆర్బీఐ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ తో సిబిల్ స్కోర్ సమస్యలకు పరిష్కారం లభించినట్లైంది.

CIBIL స్కోర్ చెక్ చేసిన సమాచారాన్ని కస్టమర్ కు పంపాలి

  • బ్యాంకు లేదా ఎన్‌బిఎఫ్‌సి ఖాతాదారుడి క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసినప్పుడల్లా, ఆ కస్టమర్‌కు సమాచారాన్ని పంపాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు సూచించింది. ఈ సమాచారాన్ని ఎస్ఎమ్ఎస్ లేదా ఇమెయిల్ ఐడీకి పంపిస్తారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై సిబిల్ స్కోర్ చెక్ చేసిన ప్రతిసారి సమాచారం అందనుంది.

ఈఎంఐ చెల్లించనప్పుడు కస్టమర్ కు  సమాచారం అందించేలా

  • మనం ఏదైనా లోన్ కు సంబంధించి ఈఎంఐ మిస్ చేసినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తగ్గిస్తామంటూ బ్యాకులు ఎస్ఎంఎస్ పంపిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మెసేజెస్ చూసుకోం. అలాంటి వాటికి చెక్ పెట్టేలా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఎస్ఎంఎస్ లు పంపాలని ఆర్బీఐ చెప్పింది. దీంతో ఇకపై క్రెడిట్ బ్యూరోలు ఈఎంఐ చెల్లించకున్నా, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోయినా కస్టమర్ కు సమచారం అందిస్తుంటాయి.

క్రెడిట్ స్కోర్ ఫుల్ రిపోర్టును ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

  • క్రెడిట్ బ్యూరో సంస్థలు క్రెడిట్ స్కోర్ ఫుల్ రిపోర్టును అందించేందుకు అంతకు ముందు ఛార్జ్ చేసేవి.కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఫ్రీగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కంపెనీలు సంవత్సరానికి ఒకసారి తమ కస్టమర్లకు పూర్తి క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా అందించాలి. దీని కోసం, క్రెడిట్ కంపెనీ తన వెబ్‌సైట్‌లో లింక్‌ను ప్రదర్శించవలసి ఉంటుంది.

రాంగ్ ఎంట్రీస్ ను కరెక్ట్ చేయకపోతే కస్టమర్ కు రూ. 100 చెల్లిస్తుంది.

  • మీ సిబిల్ రిపోర్టులో వేరే వాళ్ల లోన్ డిటేయిల్స్ వచ్చిచేరినప్పుడు వాటిని రాంగ్ ఎంట్రీస్ అంటాము. ఒక వేళ వారు లోన్ ఈఎంఐ చెల్లించని పక్షంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఆ సమయంలో మీరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. కంప్లైంట్ అందిన వెంటనే సదరు బ్యాంకులను క్లారిఫికేషన్ కోరుతుంది. లోన్ అందించే సంస్థకు 21 రోజులు మరియు క్రెడిట్ బ్యూరోకు 9 రోజుల సమయం ఉంటుంది. 21 రోజుల్లోగా బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకు సమాచారం ఇవ్వకపోతే, బ్యాంక్ పరిహారం చెల్లిస్తుంది. బ్యాంకు నుంచి సమాచారం అందిన 9 రోజుల తర్వాత కూడా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే, క్రెడిట్ బ్యూరో కస్టమర్ కు రోజుకు రూ. 100 జరిమానా చెల్లిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి