iDreamPost

మే నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు.. బ్యాంకు పనులుంటే ఇప్పుడే చేసుకోండి!

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ ఖాతాకు సంబంధించి ఏవైనా పనులుంటే ఇప్పుడే చేసుకోండి.

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ ఖాతాకు సంబంధించి ఏవైనా పనులుంటే ఇప్పుడే చేసుకోండి.

మే నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు.. బ్యాంకు పనులుంటే ఇప్పుడే చేసుకోండి!

ఈ ఏడాది మరో నెల కాలగమనంలో కలిచిపోనున్నది. ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనున్నది. కొత్త నెల ప్రారంభం అవుతుందంటే చాలు ఎన్నో మార్పులు సంబవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వచ్చే మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ఏకంగా మే నెలలో దాదాపు సగం రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి. వచ్చే నెలలో బ్యాంక్‌లకు మొత్తం 12 హాలిడేస్‌ వచ్చాయి. వీటిలో 2 &4 శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారతాయనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

మీకు ఏవైనా బ్యాంకు పనులు ఉన్నట్లైతే బ్యాంకులు ఏరోజుల్లో పనిచేస్తాయో ముందుగానే తెలుసుకుంటే మంచిది. బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు చాలా వరకు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నప్పటికీ కొన్ని పనులకు బ్యాంకులకు వెళ్లాల్సిందే. అంటే.. ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ వంటి ఇతర అవసరాల కోసం నేరుగా బ్యాకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి వచ్చే మేనెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు.. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మే నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులివే:

  • మే 01 (బుధవారం): మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
  • మే 05: ఆదివారం.
  • మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకుల బంద్ కానున్నాయి.
  • మే 10 ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.
  • మే 11: రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లు క్లోజ్.
  • మే 12: ఆదివారం.
  • మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు
  • మే 19: ఆదివారం.
  • మే 20 ‍‌(సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులను మూసేస్తారు.
  • మే 23 ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు.
  • మే 25: నాలుగో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లలకు సెలవు.
  • మే 26: ఆదివారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి