• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » nostalgia » Rendu Shabdhala Chilipi Ala

రెండు దశాబ్దాల చిలిపి ‘అల్లరి’

  • By idream media Updated On - 11:56 AM, Tue - 2 August 22 IST
రెండు దశాబ్దాల చిలిపి ‘అల్లరి’

సినిమా టైటిలే ఇంటి పేరుగా మారిపోవడం అరుదు. మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం లాంటి వాళ్లకు ఆయా చిత్రాలు తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎన్నో. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తెచ్చుకున్న నరేష్ పరిచయమైన అల్లరి ఇవాళ్టితో 20వ ఏట అడుగుపెట్టింది. ఆ విశేషాలు చూద్దాం. 2002. నటుడు చలపతిరావు అబ్బాయి రవిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నప్పటికీ అతని టార్గెట్ డైరెక్షన్ చేయడం మీదే ఉండేది. దానికి అనుగుణంగానే కథలు సిద్ధం చేసుకుని ప్రయత్నాలు చేసేవాడు. రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఏదైనా కొత్త ట్రెండ్ తీసుకురావాలనేది తన ఆలోచన.

అందులో ఒక సబ్జెక్టునే అల్లరిగా సురేష్ బాబుకి వినిపించారు రవిబాబు. సురేష్ సంస్థ అప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉంది. స్టోరీ నచ్చింది కానీ దాన్ని తమ బ్యానర్ లో తీయలేని పరిస్థితి. అలా అని వదులుకోలేరు. సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పేరుతో రవిబాబుతో కలిసి ఓ చిన్ని సంస్థ పెట్టేశారు. హీరోగా ముందు ఎవరెవర్నో అనుకున్నారు. లుక్ టెస్టులు కూడా అయ్యాయి. కానీ ఎవరూ నచ్చలేదు. సరిగ్గా అదే సమయంలో ఈవివి సత్యనారాయణ గారి ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్న నరేష్ రవిబాబు కంట్లో పడ్డాడు. నటనలో శిక్షణ పొంది మంచి ఆఫర్ల కోసం అతనూ ఎదురు చూస్తున్నాడని తెలిసి తండ్రి కొడుకులను కలిశాడు.

మొత్తం విన్నాక ఈవివి గారన్న మాట. సినిమా అంతా కొత్తవాళ్లే ఉన్నారు, హీరో కూడా డెబ్యూ అయితే మార్కెట్ పరంగా ఇబ్బందవుతుందేమోనని సంశయించారు. కానీ రవిబాబు కాన్ఫిడెన్స్ చూసి అంత అనుభవమున్న ఈవివి కూడా నో అనలేకపోయారు. అలా అల్లరికి శ్రీకారం చుట్టేశారు. శ్వేతా అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. చలపతిరావు, భరణి లాంటి ఒకరిద్దరు తప్ప అన్నీ కొత్త మొహాలే. 2002 మే 10న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన అల్లరి యూత్ కి పిచ్చగా నచ్చేసింది. పాల్ జె సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపించింది. సింపుల్ జోకులతో ఎలాంటి హడావిడి సౌండ్ లేకుండా ఇంత నీట్ గా తీయొచ్చా అని పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే నరేష్ కు అల్లరి ఇంటిపేరుగా మారేంత గొప్ప విజయాన్ని పేరుని సంపాదించి పెట్టింది.

Tags  

  • Allari
  • Allari naresh
  • Flying Frogs
  • Ravi Babu

Related News

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిపోర్ట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిపోర్ట్

నిన్న బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా ఉన్నంతలో కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి లవ్ టుడే కాగా రెండోది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది, మహర్షి నుంచి పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకున్న అల్లరి నరేష్ ట్రై చేసిన మరో సోషల్ మెసేజ్ సబ్జెక్టు ఇది. ప్రమోషన్ల టైం నుంచే ఇందులో కాన్సెప్ట్ ఏంటో దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. సందేశం […]

10 months ago
ఓటిటి ఫిక్స్ అయిన మరో రెండు

ఓటిటి ఫిక్స్ అయిన మరో రెండు

2 years ago
బాలీవుడ్ వెళ్తున్న నాంది

బాలీవుడ్ వెళ్తున్న నాంది

2 years ago
ఆసక్తి రేపుతున్న ‘నాంది’  పరిచయాలు

ఆసక్తి రేపుతున్న ‘నాంది’ పరిచయాలు

3 years ago
కారులో కూర్చుని ఏడిపించిన సినిమా

కారులో కూర్చుని ఏడిపించిన సినిమా

3 years ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    3 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    3 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    3 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    4 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    5 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    5 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    5 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    6 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    6 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version