iDreamPost

కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వివిధ రకాల పథకాలతో ప్రజల మదిలో నిలిచారు. ప్రభుత్వశాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా సీఎం జగన్‌ అలానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు పండగలాంటి వార్త.. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధను ఏపీ ప్రభుత్వం తొలగించనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్ అంగీకరించారు. దీంతో కాంట్రాక్ట్  ఉద్యోగులను రెగ్యులర్ చేయనంది. త్వరలోనే  ఈ అంశానికి సంబంధించిన ఉత్తర్యూలను ప్రభుత్వం జారీ చేయనుంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజలతో పాటు ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచి.. గుడ్ న్యూస్ చెప్పగా.. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో అలాంటి వార్తే చెప్పనున్నారని తెలుసుంది.  కాంట్రాక్ట్  ఉద్యోగులకు సంబంధించి.. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. దీంతో త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులు  రెగ్యులర్ కానున్నారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన.  సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ధి కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు.

విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కి జీతాలు 37 శాతం పెంచింది ఏపీ ప్రభుత్వం.  ఈమేరకు బుధవారం విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరి.. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగల విషయంలోనూ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకోనున్నారు. మరి… కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకోనున్నా ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌.. భారీగా జీతం పెంపు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి