iDreamPost

YS Jagan: పులివెందుల సభలో షర్మిల, సునీతలపై CM జగన్ ఫైర్!

వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మినీ సెక్రటేరియట్ లోని ఆర్వో ఆఫీస్ కు వెళ్లి.. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మినీ సెక్రటేరియట్ లోని ఆర్వో ఆఫీస్ కు వెళ్లి.. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

YS Jagan: పులివెందుల సభలో షర్మిల, సునీతలపై CM జగన్ ఫైర్!

ఏపీ ఎన్నికల హీట్ తీవ్ర స్థాయిలో ఉంది. ఇటీవలే నోటిఫికేషన్ విడుదల కావడం నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పొలిటికల్ హీట్ మరోస్థాయికి చేరింది. ఇక ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని, అక్కడ నుంచి పులివెందుకలకు వెళ్లి..నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే కంటే ముందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పులివెందులకు వైఎస్సార్ కుటుంబం చేసిన సేవల గురించి వివరించారు. ఇదే సమయంలో షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మినీ సెక్రటేరియట్ లోని ఆర్వో ఆఫీస్ కు వెళ్లి.. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు.. ఇప్పుడు కృష్ణా నీళ్లు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్‌ వల్లే ఈ అభివృద్ధి పరుగులు. నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్‌, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇదే సమయంలో వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు.

ఇక ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్‌ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలే. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారు. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, అలాంటి మోసపూరితమైన పార్టీలతో చేతులు కలిపినవాళ్లా?, పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైఎస్సార్ వారుసులా?” అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఇక సీఎం జగన్ మాట్లాడుతూ..” బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. గత ఎన్నికల్లో చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఓడించిన వాళ్లతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్‌ చదువుతున్న వీళ్లా వైఎస్సార్‌ వారసులు?. తమ సొంత లాభం కోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండి” అంటూ ప్రజలను ఉద్దేశించి.. సీఎం జగన్ భావోద్వేగంగా ప్రసంగించారు. మరి.. సీఎం జగన్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి